
39 నిమిషాల పాటు సాగిన ఏకపక్ష పోరులో కశ్యప్ వరుస గేమ్‌ల్లో అలవోకగా విజయం సాధించాడు. ఏపీ షట్లర్ 29 ఏస్‌లు సంధించగా, ప్రత్యర్థి 15కు పరిమితమయ్యాడు. మ్యాచ్ ఆరంభంలో 10-6 ఆధిక్యం లో నిలిచిన కశ్యప్ వరుసగా నాలుగు పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక రెండో గేమ్‌లో 9-9తో హోరాహోరీ పోరు సాగినా తర్వాత కశ్యప్ జోరును డెన్మార్క్ షట్లర్ అడ్డుకోలేకపోయాడు. కశ్యప్ గేమ్‌తో పాటు మ్యాచ్‌ను తన వశం చేసుకున్నాడు. కాగా సెమీస్‌లో ఏడో సీడ్ సిమోన్ శాంటొసొ (ఇండోనేసియా) నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.
మహిళల సిం గిల్స్ క్వార్టర్స్‌లోసైనా పోరాడి గెలిచింది. మూడో సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా)తో జరిగిన మ్యాచ్‌లో ఐదో సీడ్ సైనా 21-17, 21-23, 21-19 తో అతికష్టమ్మీద నెగ్గింది. గంటా 37 నిమిషాల పాటు ఆద్యంతం హోరాహోరీగా సాగిన పోరులో హైదరాబాదీ మూడు గేమ్ ల్లో మ్యాచ్‌ను ముగించింది. నువ్వానేనా అన్నట్టు సాగిన తొలి గేమ్‌లో ఓ దశలో 16-16తో స్కోరు సమమైంది. ఈ దశలో సైనా విజృంభించి గేమ్‌ను నెగ్గింది.
రెండో గేమ్ కూడా 21-21తో సమమయ్యాక వాంగ్ రెండు పాయింట్లు సాధించి మ్యాచ్‌ను మూడో గేమ్‌కు తీసుకెళ్లింది. ఇక నిర్ణాయక మూడో గేమ్‌లోనూ ఇదే పరిస్థితి. చెరో 19 పాయింట్లతో విజయానికి చేరువైన దశలో సైనా రెండు వరస పాయింట్లతో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. సెమీస్‌లో అన్‌సీడెడ్ జి హ్యున్ సంగ్ (కొరియా)తో తలపడనుంది.