For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చరిత్ర సృష్టించనున్న హైదరాబాదీలు: సైనా, కశ్యప్

By Nageswara Rao

లండన్, ఆగస్టు 2: గురువారం (ఆగస్టు 2) ఇండియన్ బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు. కారణం వెంబ్లీ ఎరీనాలో భారత్‌కు చెందిన షట్లర్స్ చరిత్ర సృష్టించనున్న రోజు. లండన్ ఒలింపిక్స్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ఇద్దరూ వారి వారి విభాగాల్లో క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడునున్నారు. వీరిద్దరూ హైదరాబాద్‌కు చెందిన వారు కావడం విశేషం. దీంతో లండన్ ఒలింపిక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు వన్నె తీసుకోని రావడంతో పాటు యావత్ భారత్ బ్యాడ్మింటన్ గర్వపడేలా ఆడుతున్నారు.

History beckons for Kashyap and Saina

ఇప్పటి వరకు భారతదేశానికి చెందిన ఓ ఒక్క బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కూడా ఒలంపిక్స్ సింగిల్స్‌లోకి అడుగు పెట్టలేదు. బుధవారం పురుషుల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగు పెట్టిన తొలి భారతీయుడిగా హైదారాబాద్‌కు చెందిన పారుపల్లి కశ్యప్ చరిత్ర సృష్టించాడు. ఇక సైనా నెహ్వాల్ విషయానికి వస్తే 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ.. మళ్లీ లండన్ ఒలింపిక్స్ లో రెండోసారి క్వార్టర్ ఫైనల్స్‌లోకి అర్హత సాధించడం వల్ల సైనా కూడా రికార్డు సృష్టించింది.

22 సంవత్సరాల వయసు కలిగిన సైనా నెహ్వాల్ బీజింగ్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌ నుండి వెనుదిరిగింది. ఐతే ఈసారి మాత్రం ఎలాగైనా ముందుకు సాగుతాననే ధీమాని వ్యక్తం చేసింది. గత ఐదు సంవత్సరాలుగా సైనా నెహ్వాల్ ఆటతీరుని చూస్తే ఖచ్చితంగా ఈసారి లండన్ ఒలింపిక్ మెడల్‌ని సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు అందరూ. ఈ ఏడాది సైనా నెహ్వాల్ స్విస్ ఓపెన్, థాయ్ లాండ్ ఓపెన్, ఇండోనేషియా ఓపెన్ లాంటి పెద్ద టైటిల్స్‌ని సాధించింది.

ప్రస్తుతం సైనా నెహ్వాల్ ప్రపంచ ర్యాంకింగ్‌లో ఐదవ స్దానంలో ఉంది. ఈరోజు జరగనున్న మ్యాచ్‌లో డెన్మార్క్ క్రీడాకారిణి టిన్ బౌన్‌తో తలపడనుంది. గతంలో వీరిద్దరూ ఆరుసార్లు తలపడగా.. 3-3 మ్యాచ్‌లను గెలుపొందారు. ఒలింపిక్స్ లాంటి పెద్ద స్టేజి మీద వీరిద్దరూ మరోసారి తలపడనున్నారు. ఒలింపిక్స్‌లో ఆడడం అనేది క్రీడాకారులకు ఎల్లప్పుడూ ఒత్తిడే. ఈరోజు జరగనున్న మ్యాచ్‌లో యావత్ భారతదేశం మొత్తం సైనా నెహ్వాల్ గెలవాలని ఆకాంక్షిస్తుంది.

ఇక పురుషుల సింగిల్స్ విభాగానికి వస్తే పారుపల్లి కశ్యప్ ఈరోజు ప్రపంచ రెండో ర్యాంకర్ లీ చాంగ్‌తో తలపడున్నాడు. ఇతను మలేసియాకు చెందిన వాడు. 25 సంవత్సరాల వయసు కలిగిన పారుపల్లి కశ్యప్ 21వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. 2011లో డెన్మార్క్ ఓపెన్ సిరిస్‌లో గతంలో వీరిద్దరూ తలపడితే మలేసియాకు చెందిన లీ చాంగ్‌, కశ్యప్‌పై 21-11, 21-13 అవలీలగా విజయం సాధించాడు. వీరిద్దరూ కూడా మాజీ బ్యాడ్మింటన్ పుల్లెల గోపీ చంద్ శిక్షణలో ప్రాక్టీస్ చేస్తున్నారు.

Women's Singles Quarter-finals

Saina Nehwal (World No. 5) Vs Tine Baun (World No. 7) (Match starts 6.32 PM IST)

Previous meetings (3-3)

Malaysia Open (13.1.2012) Saina won 21-13, 21-23, 21-13

BWF World Super Series 2011 (17.12.2011) Saina won 21-17, 21-18

Hong Kong Open 2011 (18.11.2011) Baun won 21-16, 21-15

Indonesia Open (24.06.2011) Saina won 21-19, 21-19

All England Super Series 2010 (13.03.2010) Baun won 21-19, 21-17

Hong Kong Super Series 2007 (27.11.2007) Baun won 21-15, 12-21, 21-16

Men's Singles Quarter-finals

P Kashyap (World No. 21) Vs Lee Chong Wei (World No. 2) (Match starts 9.32 PM IST)

Previous meeting (Wei 1-0)

Denmark Open (19.10.2011) Wei won 21-11, 21-13

Note: Timings subject to change.

తెలుగు వన్ఇండియా

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+