ప్రజక్తాకు వేధింపు: అకాడమీపై గోపిచంద్‌కు కోర్టు షాక్

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ప్రజక్తా సావంత్ గతంలో గోపీచంద్ పైన కోర్టుకు వెళ్లింది. డబుల్, మిక్స్‌డ్ డబుల్స్‌లో తన పార్ట్‌నర్స్‌ను మార్చాలని కోరడంతో తనకు ఆటపై శ్రద్ధ లేదని గోపీచంద్ తనను క్యాంపుకు ప్రాక్టీస్ కోసం రావద్దని ఆదేశించాడని ప్రజక్తా సావంత్ ఆరోపిస్తోంది.
తనను గోపీచంద్ మానసికంగా వేధిస్తున్నాడంటూ ప్రజక్తా గత నవంబరులో బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తన కెరీర్‌ను గోపీచంద్ నాశనం చేశాడని ఆమె ఆరోపించింది. గోపీచంద్ మానసికంగా వేధిస్తున్నాడన్న ప్రజక్తా సావంత్ ఆరోపణలకు గతంలో గుత్తా జ్వాల కూడా మద్దతు పలికింది.
ప్రజక్తా పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు జాతీయ కోచ్ ప్రయివేటు అకాడమీ నడపడాన్ని తప్పు పడుతూ నోటీసులు జారీ చేసింది. కాగా ప్రముఖ ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ పరోక్షంగా ప్రజక్తా సావంత్, గుత్తా జ్వాల ఆరోపణలను గతంలోనే ఖండించింది. గోపీచంద్ వేధింపులు నిజమే అయితే తాను ఈ స్థాయిలో ఉండేదానిని కాదన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications