Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అన్యాయం జరిగింది: కన్నీళ్లు పెట్టుకున్న గుత్తా జ్వాలా

Gutta Jwala
హైదరాబాద్: ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్(ఐబిఎల్)లో తనకు అన్యాయం జరిగిందని గుత్తా జ్వాలా మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. ఓ సమయంలో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు ఇంత అన్యాయం జరుగుతుందనుకోలేదని చెప్పారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా తనకు చాలా బాధేస్తోందన్నారు.

తనపై అన్యాయంగా రెబల్ అని ముద్ర వేశారన్నారు. డబుల్స్‌లో తాను చాలా టైటిల్స్ గెలుచుకున్నానని, తానెలాంటి పొరపాటు చేయలేదన్నారు. ప్రతి టోర్నమెంటులోను అంకిత భావంతోనే అడినట్లు చెప్పారు. తన బేస్ ప్రైస్ తగ్గించినందుకు బాధగా అనిపించిందన్నారు. తక్కువ రేటు వచ్చినందుకు బాధగా లేదని, చెప్పకుండా చేశారన్నారు.

కాగా, ఐబిఎల్‌లో గుత్తా జ్వాల రూ.18.41 లక్షలకే అమ్ముడు పోయిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె నిరాశ చెందారు. తాను చాలా నిరాశ చెందానని, తాను, అశ్వినిలు దిగ్గజ హోదాతో ఒప్పందాలపై సంతకం చేశామని, కాబట్టి తమకు మరింత మెరుగైన ఒప్పందాలివ్వాల్సి ఉందని అప్పుడే చెప్పారు.

తమ కనీస ధరను తగ్గించారని కూడా తమకు సమాచారమివ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల డబుల్స్ తీసేసి అదనంగా మరో పురుషుల సింగిల్స్ మ్యాచ్ చేర్చారని, ఇది తమకు ఆలస్యంగా తెలిసిందని తాను నిరాశ చెందానని గుత్తా జ్వాల చెప్పారు.

ఐబిఎల్ వేలంలో గుత్తా జ్వాల, అశ్వినిలు తక్కువ ధర పలికారు. వారి విషయంలో గందరగోళం నడిచింది. వీరిద్దరికి మొదట దిగ్గజ హోదా ఇచ్చిన ఐబిఎల్ నిర్వాహకులు.. కనీస ధరను రూ.30 లక్షలుగా నిర్ణయించారు. అయితే ఐబిఎల్‌లో మహిళల డబుల్స్ ఈవెంటును తొలగించి, అదనంగా సింగిల్స్‌ను చేర్చిన నేపథ్యంలో జ్వాల, అశ్వినిల ప్రాధాన్యత తగ్గిపోయింది.

దీంతో వారిని రూ.30 లక్షలు పెట్టి కొనడానికి ఫ్రాంచైజీలు ముందుకు రాలేదు. షాక్ తిన్న నిర్వాహకులు అప్పటికప్పుడు నిబంధనలు మార్చారు. వారి కనీస ధరను రూ.15 లక్షలకు తగ్గించారు. అదే సమయంలో జ్వాలా, అశ్వినిలు నిరాశ చెందకుండా ఉండేందుకు ముప్పై లక్షల రూపాయల్లో ఫ్రాంఛైజీలు ఆ ధర లోపు కొంటే మిగతా మొత్తాన్ని చెల్లిస్తామని నిర్వాహకులు చెప్పారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+