ఐబిఎల్‌లో జ్వాలా గుత్తా ప్రవర్తన: బాయ్ విచారణ

ఇటీవల ముగిసిన ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ సందర్భంగా క్రిష్ ఢిల్లీ స్మాషర్స్ తరఫున గుత్తా జ్వాల సారథిగా వ్యవహరించారు. ఈ సమయంలో ఆమె బంగా బీట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడరాదంటూ తమ జట్టు క్రీడాకారులు కొందరిని జ్వాల రెచ్చగొట్టినట్టు ఆరోపణలు వచ్చాయి.
గత నెల 25న జరిగిన ఈ మ్యాచ్‌లో ఆటగాడిని మార్చే విషయంలో వివాదం నెలకొంది. బంగా బీట్స్ షట్లర్ హు యున్ గాయపడటంతో అతని స్థానంలో జోర్గెన్‌సెన్‌ను బరిలోకి దించేందుకు ఐబిఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అనుమతిచ్చింది. ఈ మార్పును ఢిల్లీ షట్లర్లు వ్యతిరేకిస్తూ మ్యాచ్ ఆడబోమని హెచ్చరించారు.
దీంతో బంగా జోర్గెన్‌సెన్‌ను ఆడించకుండా అరవింద్ భట్‌ను బరిలోకి దింపింది. ఈ విషయంపై జ్వాలకు ఇదివరకే షోకాజ్ నోటీసు పంపారు. 14 రోజుల్లోగా సమాధానమివ్వాలని జ్వాలకు గడువు విధించినట్టు బాయ్ ప్రతినిధి ఒకరు చెప్పారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications