Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో ఫిక్సింగ్: 8 మందిపై వేటు

London Olympics 2012
లండన్: లండన్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ వెలుగు చూసింది. బ్యాడ్మింటన్ మహిళా జట్లు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలింది. మహిళా డబుల్స్‌కు చెందిన నాలుగు జట్లకు చెందిన 8 మంది ఆటగాళ్లు అర్హత కోల్పోయారు. విచారణ అనంతరం వారిపై బ్యాడ్మింటన్ ప్రపంచ సమాఖ్య వారిపై వేటు వేసింది. మూడు దేశాలకు చెందిన నాలుగు జట్లు ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు తేలింది.

చైనా ప్రపంచ చాంపియన్లు వాంగ్ జియోలీ, యు యాంగ్‌, ఇండోనేషియాకు చెందిన గ్రేషియా పోలి, మీలియానా జౌహరి, దక్షిణ కొరియాకు చెందిన జుంగ్ క్యుయుంగ్ - ఎయున్, కిమ్ హా - నా, హా జుంగ్ ఎయున్, కిమ్ మిన్ జుంగ్‌లపై ఆరోపణలు వచ్చాయి. సానుకూలమైన క్వార్టర్ ఫైనల్ డ్రా కోసం వారు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ చర్యను క్రీడల సమగ్రతకు పెద్ద ముప్పుగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు జాక్విస్ రోగ్గె వ్యాఖ్యానించారు. బెట్టింగ్ జరిగినట్లు ఏ విధమైన సమాచారం లేదు. గ్రూప్ బిలో తైపీ జపాన్ ఆటగాళ్లు కూడా ఇదే చేసి ఉంటారని భారత్‌కు చెందిన అశ్విని పొన్నప్ప ఆరోపించారు. మ్యాచ్‌ను గెలిచినప్పటికీ మహిళా డబుల్స్ నుంచి జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్ప ఒలింపిక్స్ మహిళా డబుల్స్ నుంచి అవుటయ్యారు. మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంపై ఇండియా ఫిర్యాదు చేసింది

భారత్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా కూడా జపాన్ జట్టు ఓటమిపై అనుమానాలు వ్యక్తం చేశారు. జపాన్ జోడీ ఫౌల్ ప్లే ఆడుతున్నట్లు తమకు అనుమానం వచ్చిందని ఆమె అన్నారు. అవకాశం వస్తే వళ్లీ ఆడేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆమె తెలిపారు. ఫిక్సింగ్ చేసినవారిపై చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. సానుకూల వాతావరణం కోసం జట్లు ఓడిపోతున్నాయని భారత బ్యాడ్మింటన్ కోచ్ గోపిచంద్ కూడా అన్నారు. ఇదిలా వుంటే, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై చైనా విచారణకు ఆదేశించింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+