
సింధు కెరీర్‌లో అతి పెద్దది. సింధు టోర్నీలోకి ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టింది. 17 ఏళ్ల తెలుగు అమ్మాయి సింధ్ సెమీ ఫైనల్లో థాయ్‌లాండ్‌కు చెందిన బుసానన్ ఒంగ్‌బుమ్రుంగ్పన్, చైనాకు చెందిన నాలుగో సీడ్ యాంజియాయో జియాంగ్ మధ్య జరిగే మ్యాచులో గెలిచే క్రీడాకారిణితో తలపడాల్సి ఉంటుంది.
గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్ లో ప్రపంచ 24వ ర్యాంక్ ప్లేయర్ సింధు 10-21, 21-7, 21-19తో వరల్డ్ 14వ ర్యాంకర్ పోర్న్‌టిప్ బురానాప్రసెర్ట్‌సక్‌పై గెలిచింది. దీంతో ఆమె క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 47 నిమిషాలు పా టు జరిగిన ఈ పోరులో తొలి గేమ్‌ను కోల్పోయిన సింధు రెండో గేమ్‌లో విజృంభించింది. సునాయాసంగా ఆ గేమ్‌ను సొంత చేసుకుని ఫలితాన్ని మూడో గేమ్‌కు తీసుకెళ్లింది.
పురుషుల విభాగంలో గురువారం తలపడిన కశ్యప్, గురుసాయి దత్ ఆధిక్యం కోసం గంటా ఆరు నిమిషాలు పాటు పోరాడారు. చివరికి గురుసాయి 16-21, 21-18, 21-4తో ఎనిమిదో సీడ్ కశ్యప్‌పై గెలిచి క్వార్టర్స్‌లో అడుగు పెట్టాడు.
అయితే మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఎనిమిదో సీడ్‌గా బరిలోకి దిగి న అశ్విని పొన్నప్ప, తరుణ్ కోన జోడీ తొలి రౌండ్‌లోనే ఓటమి చవిచూసింది. ఈ భారత జోడీ 9-21, 14-21తో మలేసియా ద్వయం జియాన్ గువో ఆంగ్, యిన్ లూ లిమ్ చేతిలో ఓటమిపాలైంది.