
భారత అథ్లెట్స్ రెండు వరుస పరాజయాలు చవి చూసిన తర్వాత 2012 లండన్ ఒలింపిక్స్ పోటీల్లో పి. కశ్యప్ తాన్ యుహాన్‌తో తలపడడానికి మైదానంలోకి అడుగు పెట్టాడు. కశ్యప్ అత్యంత విశ్వాసంతో మ్యాచ్ ఆడాడు. మొదటి గేమ్‌ను 21 నిమిషాల్లో 21-14 స్కోరుతో గెలుచుకున్నాడు.
పాతికేళ్ల హైదరాబాదీ ఆటగాడు ఈ విజయం ద్వారా భారత బృందంలో ఆశలు రేకెత్తించాడు. అతను గ్రూప్ డిలో ఉన్నాడు. పురుషుల సింగిల్స్‌లో మొత్తం 16 గ్రూపులున్నాయి. ప్రతి గ్రూపూలోని టాప్ ప్లేయర్ నాకవుట్ రౌండ్‌కు చేరుకుంటాడు.
కాగా, ఆర్చరీలో భారత జట్టు జపాన్ జట్టు చేతిలో ఓటమి పాలైంది. అలాగే, బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో జ్వాలా గుత్తా, వి దిజు జోడీ ఇండోనేషియా జోడీపై ఓటమి పాలైంది.