విశాఖపట్నం: సినిమాలకు, క్రీడలకు అవినాభావ సంబంధం ఉన్నట్లే అనిపిస్తోంది. బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా తెలుగు సినిమాల్లో ప్రవేశించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రానికి చెందిన మరో క్రీడాకారిణి తెలుగు సినిమాల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తోంది. చెస్ క్రీడాకారిణి కోనేరు హంపీ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపుతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది.
తనకు సినిమాల్లో ప్రవేశించాలనే ఆసక్తి ఉందని కోనేరు హంపి విశాఖపట్నంలో మీడియా ప్రతినిధులతో చెప్పింది. తాను సినిమాల్లో నటిస్తానని చెప్పింది. విశాఖపట్నంలో వెయిట్ లిఫ్టింగ్ కోచింగ్ ఆకాడమీని పెట్టాలని తాను ప్రయత్నిస్తున్నట్లు కోనేరు హంపి చెప్పింది.
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా గుండె జారిగల్లయింతయ్యిందే అనే సినిమాలో ఐటం సాంగ్ చేసిన విషయం తెలిసిందే. హీరో నితిన్‌తో కలిసి ఆమె చేసిన ఐటం సాంగ్ ఛాయాచిత్రాలు విపరీతమైన క్రేజ్ తెచ్చి పెట్టింది. ఆమె ఆ పాటలో తన అందాలను ఆరబోసింది.
కోనేరు హంపి చెస్ క్రీడ ద్వారా పాపులారిటీని సంపాదించుకుంది. పలు టోర్నమెంటులో విజేతగా నిలిచింది. ఆమెకు అభిమానులు దండిగానే ఉన్నారు. అందానికి అందం, క్రేజ్‌కు క్రేజ్ ఉన్న హంపీ సినిమాల్లో నటిస్తే అదరగొట్టడం ఖాయమని అంటున్నారు. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను సినిమాల్లో నటింపజేయడానికి తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. అయితే, ఆమె డికె బోస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది.