న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నేటి నుంచి సింగపూర్‌ ఓపెన్‌.. టైటిల్ దక్కేనా!

Singapore Open: Sindhu And Saina hopes to find form

ఈ రోజు నుండే సింగపూర్‌ ఓపెన్‌ టోర్నీ ప్రారంభమవుతోంది. మంగళవారం క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లు జరగగా.. బుధవారం నుంచి మెయిన్‌ డ్రా మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ సంవత్సరం ఒక్క సైనా నెహ్వాల్ తప్ప ఏ ఒక్క షట్లర్‌ కూడా టైటిల్ సాధించలేదు. దీంతో స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, కిడాంబి శ్రీకాంత్‌, ప్రణయ్‌, సాయి ప్రణీత్‌లు టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు.

తొలిరౌండ్లో మయినకితో పోరు:

తొలిరౌండ్లో మయినకితో పోరు:

బుధవారం జరిగే తొలిరౌండ్లో సింధు ఇండోనేసియాకు చెందిన లియాని అలెసాండ్రా మయినకితో తలపడుతుంది. గత డిసెంబర్‌లో బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీలో విజేతగా నిలిచిన సింధు ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా తన ఖాతాలో వేసుకోలేదు. ఇండోనేసియా ఓపెన్‌లో క్వార్టర్స్‌లో.. ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌లో తొలిరౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఇండియా ఓపెన్‌లో సెమీస్‌ చేరినా.. తాజాగా ముగిసిన మలేసియా ఓపెన్‌లో రెండో రౌండ్లోనే ఓడిపోయింది. దీంతో ఎలా అయినా టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉంది.

జార్స్‌ఫెల్ట్‌తో సైనా పోటీ:

జార్స్‌ఫెల్ట్‌తో సైనా పోటీ:

మరో షట్లర్‌ సైనా నెహ్వాల్‌ తొలిరౌండ్లో డెన్మార్క్‌కు చెందిన లిన్‌ హొజ్మర్క్‌ జార్స్‌ఫెల్ట్‌తో పోటీపడనుండి. సైనా ఇండోనేసియా ట్రోఫీ గెలుచుకుంది. అయితే ఫైనల్లో మారిన్‌ గాయంతో వైదొలగడంతో సైనా విజేతగా నిలిచింది. అనంతరం ఆల్‌ ఇంగ్లండ్‌లో క్వార్టర్స్‌లో ఓడింది. అనారోగ్య కారణాలతో స్విస్, ఇండియా ఓపెన్‌లు ఆడలేదు. ఇక మలేసియా టోర్నీలో ఆడినా.. తొలిరౌండ్‌లోనే నిష్క్రమించింది. దీంతో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

క్లిష్టమైన పోటీ:

క్లిష్టమైన పోటీ:

పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ తొలి రౌండ్లో క్వాలిఫయర్‌తో పోటీపడనున్నాడు. సాయి ప్రణీత్‌ టాప్‌సీడ్‌ కెంటో మొమొట (జపాన్‌)తో తలపడనున్నాడు. దీంతో ప్రణీత్‌కు క్లిష్టమైన పోటీ ఎదురైంది. ప్రణయ్‌ ఫ్రాన్స్‌కు చెందిన బ్రిస్‌ లెవెర్డెజ్‌తో మ్యాచ్ ఆడనున్నాడు. ఈ రోజు జరిగే క్వాలిఫయింగ్‌లో పారుపల్లి కశ్యప్‌ మలేసియాకు చెందిన చిమ్‌ జున్‌ వీతో ఆడతాడు.

Story first published: Tuesday, April 9, 2019, 10:30 [IST]
Other articles published on Apr 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X