Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సింగపూర్ ఓపెన్: క్వార్టర్స్‌లో సింధు, సైనా, శ్రీకాంత్

Singapore Open: PV Sindhu, Saina Nehwal, Kidambi Srikanth Seal Quarterfinal Spots, Parupalli Kashyap Bows Out

సింగపూర్‌ ఓపెన్‌లో భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్, సమీర్ వర్మలు దూసుకెళ్తున్నారు. వీరందరూ సింగిల్స్‌ విభాగంలో అద్భుతంగా రాణించి క్వార్టర్స్‌కు చేరుకున్నారు. అయితే పారుపల్లి కశ్యప్ మాత్రం ఇంటిదారి పట్టాడు.

వరుస గేములలో గెలుపు:

వరుస గేములలో గెలుపు:

మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో నాలుగో సీడ్ సింధు 21-13, 21-19తో డెన్మార్క్ కి చెందిన మియా బ్లిఫెల్డ్ ట్ పై గెలుపొందింది. 39 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో మియాను వరుస గేములలో ఓడించింది. మొదటి గేమ్ లో సింధు సునాయాసంగా గెలిచినా.. రెండో గేమ్ లో మాత్రం ప్రతిఘటన ఎదురైంది. క్వార్టర్ ఫైనల్లో సింధు చైనాకి చెందిన కాయీ యాన్యాన్ తో తలపడుతుంది.

ఒకుహారాతో సైనా అమితుమీ:

ఒకుహారాతో సైనా అమితుమీ:

మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్లో ఆరో సీడ్ సైనా నెహ్వాల్ 21-16, 18-21, 21-19తో పోర్న్ పావీ చోచువాంగ్ ( థాయిలాండ్ )పై విజయం సాధించింది. గత వారం ముగిసిన మలేసియా ఓపెన్ మొదటి రౌండ్ లోనే సైనాను చోచువాంగ్ ఓడించింది. క్వార్టర్స్‌లో జపాన్ కి చెందిన నొజోమీ ఒకుహారాతో సైనా అమితుమీ తేల్చుకోనుంది.

శ్రీకాంత్‌, సమీర్ ముందంజ:

శ్రీకాంత్‌, సమీర్ ముందంజ:

పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ 21-12, 23-21తో క్రిస్టియన్ విట్టింగస్ (డెన్మార్క్)ను మట్టికరిపించాడు. 41 నిమిషాల పాటు ఈ మ్యాచ్‌లో విట్టింగస్ వరుస గేములలో కంగుతిన్నాడు. సమీర్ వర్మ చైనా ఆటగాడు లు గ్వాంగ్జూని 21-15,21-18తో చిత్తు చేశాడు. క్వార్టర్ ఫైనల్స్ లో రెండో సీడ్ తైపీ క్రీడాకారుడు చౌ తియాన్ చెన్ తో కానీ, డెన్మార్క్ కి చెందిన జాన్ ఓ జోర్గెన్సన్ తో కానీ తలపడనున్నాడు.

కశ్యప్ ఓటమి:

కశ్యప్ ఓటమి:

పారుపల్లి కశ్యప్ 15-21, 21-16, 22-20తో చైనా క్రీడాకారుడు చెన్ లాంగ్ చేతిలో ఓడిపోయాడు. 71 నిమిషాలు పాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో కశ్యప్ ఓటమిపాలయ్యాడు.

Story first published: Thursday, April 11, 2019, 19:52 [IST]
Other articles published on Apr 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+