Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సింగపూర్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌.. ప్రిక్వార్టర్స్‌కు సింధు, సైనా

Singapore Open: PV Sindhu, Saina Nehwal enters Round 2, Manu-Sumeeth Out

సింగపూర్‌ ఓపెన్‌లో భారత స్టార్‌ షట్లర్లు అందరూ సత్తా చాటారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్.. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, కశ్యప్, ప్రణయ్, సమీర్‌ వర్మ ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నారు. సాయి ప్రణీత్‌ మాత్రం ఇంటిదారిపట్టాడు. టాప్‌ సీడ్‌ కెంటో మొమొటా (జపాన్‌) చేతిలో ప్రణీత్‌ ఓటమిని ఎదుర్కొన్నాడు.

సునాయాస విజయం:

సునాయాస విజయం:

మహిళల సింగిల్స్‌ తొలిరౌండ్లో సింధు సునాయాస విజయం అందుకుంది. సింధు 21-9, 21-7తో లియాని అలెసండ్ర మయినకిని (ఇండోనేసియా) ఓడించింది. ఈ మ్యాచ్ కేవలం 27 నిమిషాల్లోనే ముగిసింది. సైనా 21-16, 21-11తో యులియా యుసెఫిన్‌ సుశాంటో (ఇండోనేసియా)పై విజయం అందుకుంది.

సాయి ప్రణీత్‌ ఓటమి:

సాయి ప్రణీత్‌ ఓటమి:

పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ 21-17, 21-18తో సితికోమ్‌ తమసిన్‌ (థాయ్‌లాండ్‌)ను మట్టికరిపించాడు. ప్రణయ్‌ 11-21, 21-16, 21-18తో బ్రైస్‌ లెవెర్డెజ్‌ (ఫ్రాన్స్‌)పై.. సమీర్‌ వర్మ 21-14, 21-6తో సుపన్యు అవిహింగ్సనన్‌ (థాయ్‌లాండ్‌)పై.. పారుపల్లి కశ్యప్‌ 21-19, 21-14తో రస్ముస్‌ గెమ్కే (డెన్మార్క్‌)పై విజయం సాధించారు. సాయి ప్రణీత్‌ 21-19, 14-21, 20-22తో మొమొటా చేతిలో ఓటమిని చవిచూసాడు.

డబుల్స్‌లోనూ మిశ్రమ ఫలితాలే:

డబుల్స్‌లోనూ మిశ్రమ ఫలితాలే:

పురుషుల డబుల్స్‌లో మను అత్రి-సుమిత్‌ రెడ్డి జంట 13-21, 17-21తో డానీ క్రిస్నంటా-కియన్‌ హీన్‌ (సింగపూర్‌) ద్వయం చేతిలో ఓడిపోయింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కిరెడ్డి-ప్రణవ్‌ చోప్రా జంట 21-18, 21-7తో మనీష-అర్జున్‌ జోడీపై (భారత్‌) గెలుపొందింది. సౌరభ్‌ శర్మ-అనుష్క పారిఖ్‌ జోడీ 12-21, 12-21తో డెచపొల్‌ పువరనుక్రొ-తెరతనచయ్‌ (థాయ్‌లాండ్‌) జంట చేతిలో మట్టికరిచింది.

Story first published: Thursday, April 11, 2019, 9:15 [IST]
Other articles published on Apr 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+