సింగపూర్ ఓపెన్: సెమీస్‌లో సింధు ఓటమి

సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు చుక్కెదురైంది. శనివారం మహిళల సింగిల్స్ సెమీస్‌లో నాలుగో సీడ్ సింధు 7-21, 11-21తో ప్రపంచ మాజీ చాంపియన్, రెండో సీడ్ నజోమి ఒకుహర (జపాన్) చేతిలో ఓడింది. సింధు ఈ మ్యాచ్‌లో కనీస పోరాటం చేయకుండానే చేతులెత్తేసింది.
మ్యాచ్ మొదటి సింధుపై ఆధిపత్యం చెలాయించిన ఒకుహర 37 నిమిషాల్లోనే మ్యాచ్ ముగించింది. సింధు ఓటమితో ఈ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. ఒకుహరతో తలపడ్డ గత రెండు మ్యాచ్‌ల్లో సింధు విజయం సాధించినా.. ఈ మ్యాచ్‌లో మాత్రం ఓటమిని చవిచూసింది. క్వార్టర్ ఫైనల్లో మరో షట్లర్ సైనా నెహ్వాల్‌ను చిత్తుచేసిన ఒకుహర.. సింధుపై గెలిచి ఫైనల్ చేరింది. తుదిపోరులో వరల్డ్ నంబర్‌వన్ తై జుయింగ్ (చైనీస్ తైపీ)తో ఒకుహర తలపడనుంది.
Story first published: Sunday, April 14, 2019, 10:48 [IST]
Other articles published on Apr 14, 2019
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications