సింగపూర్ ఓపెన్: సెమీస్‌కు సింధు, టోర్నీ నుంచి సైనా నిష్క్రమణ

హైదరాబాద్: సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు శుక్రవారం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో సింధు సెమీస్‌కు చేరగా, సైనా నెహ్వాల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో పీవీ సింధు 21-13, 17-21, 21-14 తేడాతో యాన్యాన్(చైనా)పై అలవోక విజయాన్ని నమోదు చేసింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
తొలి గేమ్‌ను సింధు అలవోకగా సొంతం చేసుకున్నప్పటికీ... రెండో గేమ్ మాత్రం ఇద్దరి మధ్య హోరాహోరీగా సాగింది. ఇక, నిర్ణయాత‍్మక మూడో గేమ్‌లో సింధు తన అనుభవాన్ని ఉపయోగించి 21-14తేడాతో గేమ్‌తో పాటు మ్యాచ్‌ని కూడా సొంతం చేసుకుంది.
శనివారం జరుగనున్న సెమీ ఫైనల్లో పీవీ సింధు జపాన్‌కు చెందిన ఒకుహరాతో తలపడనుంది. మరో మహిళల సింగిల్స్ క్వార్టర్ మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ ఓడింది. సైనా నెహ్వాల్... జపాన్‌కు చెందిన ఒకుహరా చేతిలో 8-21, 13-21 తేడాతో ఓటమిపాలైంది. దీంతో సైనా టోర్నీ నుంచి నిష్క్రమించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications