చైనా ఓపెన్ నా కల: మాటలు రావడం లేదన్న సింధు
హైదరాబాద్: కెరీర్‌లో తొలిసారి చైనా సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ టైటిల్‌ని కైవసం చేసుకున్న భారత స్టార్ షట్లర్, రియో ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఎంతో సంతోషంగా ఉంది. చైనా ఓపెన్ గెలవడం తన చాలా రోజుల కలగా సింధు అభివర్ణించింది. ఆదివారం సన్ యు (చైనా)తో జరిగిన ఫైనల్లో సింధు 21-11, 17-21, 21-11తో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

చాలా సంతోషంగా ఉంది
టోర్నీ అనంతరం పీవీ సింధు మీడియాతో మాట్లాడింది. ‘సూపర్ సిరీస్ గెలవడం చాలా రోజులు నాటి కల. ఒలింపిక్స్ తర్వాత నా జీవితమే మారిపోయింది. నేను తిరిగి ఫామ్ అందుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని చాలామంది భావించారు. కానీ నేను చాలా కష్టపడ్డా. ఇది నా తొలి సూపర్ సిరీస్ టైటిల్. చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. ఇంతకు ముందు డెన్మార్క్ ఫైనల్ ఆడానని' సింధు పేర్కొంది.

తొలి గేమ్ చాలా సులభంగా గెలిచాను
ఇక టోర్నీ ఫైనల్ గేమ్ గురించి సింధు మాట్లాడింది. ‘నేను బాగా ఆడా. ఈ రోజు కలిసొచ్చింది. కఠిన సాధన చేయడంతో అత్యుత్తమంగా ఆడతానని అనుకొన్నా. తొలి గేమ్ చాలా సులభంగా గెలిచాను. ఆమెతో రెండున్నర ఏళ్ల తర్వాత పోటీపడ్డాను. మేమిద్దరం దూకుడు కనబరిచే షట్లర్లం. రెండో గేమ్ కోల్పోయా. మూడో గేమ్‌లో 11-7 నుంచి ఆధిక్యం నిలబెట్టుకున్నాని' తెలిపింది.

చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను సొంతం
సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ 2014లో చైనా ఓపెన్ గెలిచారు. మాజీ ప్రపంచ నెంబర్ వన్‌ను సమం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది' అని పీవీ సింధు వివరించింది. కాగా, తనకన్నా మెరుగైన ర్యాంకర్ సన్ యుపై మూడు గేమ్‌లపాటు పోరాడి గెలిచి తొలిసారిగా చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

ముఖాముఖి రికార్డును 3-3తో సమం
ఆదివారం ఇక్కడ ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు 21-11, 17-21, 21-11తో తొమ్మిదో ర్యాంకర్ సన్ యుపై విజయం సాధించింది. తాజా విజయంతో సన్ యుపై తన ముఖాముఖి రికార్డును 3-3తో సమం చేసిన సింధు 700,000 అమెరికా డాలర్లు (రూ. 36 లక్షలు) ప్రైజ్‌మనీ కూడా సొంతం చేసుకుంది.

గతంలో కూడా గెలిచే ఛాన్స్
గతంలో భారత తరఫున సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ 2014లో చైనా ఓపెన్ చాంపియన్లుగా నిలిచారు. ఆ తర్వాత మరో భారత షట్లర్ ఈ టైటిల్ నెగ్గడం ఇదే తొలిసారి. గతేడాది డెన్మార్క్ ఓపెన్‌లోనే సింధుకు సూపర్ సిరీస్ టైటిల్ గెలిచే ఛాన్స్ వచ్చింది. అయితే ఫైనల్లో లీ జురుయ్ (చైనా) చేతిలో ఓడి రన్నర్‌పతో సరిపెట్టుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications