బ్యాడ్మింటన్: రాకెట్లు విసరడానికి సిద్ధంగా ఉన్న సింధు, సైనా

హైదరాబాద్: బ్యాడ్మింటన్ సమరం మొదలైంది. అభిమానులకు ఇక పండగే. వరుస తేదీలతో మొదలైన బ్యాడ్మింటన్ లీగ్ జనవరి 14వరకు జరగనుంది. అత్యుత్తమ షట్లర్ల మధ్య పోరాటాలతో మూడు సీజన్‌లుగా అలరిస్తున్న ప్రిమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ప్రేక్షకుల చేరువలోకి డిసెంబరు 23 అంటే నేటి నుంచే మొదలుకానుంది.
శనివారం పీబీఎల్ నాలుగో సీజన్‌కు తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో తెలుగుతేజం పి.వి. సింధు నేతృత్వంలోని డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై స్మాషర్స్, సైనా నెహ్వాల్ సారథ్యంలోని అవధె వారియర్స్‌లు ఢీకొననున్నాయి. గౌహతి వేదికగా జరగనున్న ఈ సమరంలో ఎవరు గెలిచి జట్టుకు శుభారంభాన్ని అందిస్తారో చూడాలి.
అవధె వారియర్స్ భారత స్టార్ షట్లర్లు సైనా, శ్రీకాంత్, కశ్యప్‌లతో పటిష్ఠంగా కనిపిస్తోంది. చెన్నై స్మాషర్స్ మాత్రం ప్రధానంగా సింధుపైనే ఆధారపడింది. మొత్తం 8 జట్లు బరిలో ఉన్న ఈ టోర్నీ దేశంలోని 5 వేదికల్లో 23 రోజుల పాటు సాగనుంది.
హైదరాబాదే వేదిక:
సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకు హైదరాబాదే వేదిక కానుందిద. ఇదే కాక చివరి దశ గ్రూప్ మ్యాచ్‌లకు కూడా భాగ్యనగరమే వేదిక. ఫైనల్‌లో గెలిచి ప్రైజ్‌మనీ రూ. 6 కోట్లను ఎవరు దక్కించుకుంటారో చూడాలి.
మొత్తం జట్లు: 8
అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్
అవధె వారియర్స్
బెంగుళూరు బ్లాస్టర్స్
చెన్నై స్మాషర్స్
దిల్లీ డాషర్స్
హైదరాబాద్ హంటర్స్
ముంబయి రాకెట్స్
నార్త్ ఈస్టర్న్ వారియర్స్
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications