
హైదరాబాద్: ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు అజేయంగా ఫైనల్ వరకు దూసుకుపోయింది. శనివారం న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న ఇండియా టోర్నీలో తన సత్తా చాటుకుంది. దీంతో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఈ ఏడాదిలో తొలి టైటిల్ నెగ్గడానికి అడుగు దూరంలో నిలిచింది.
ఇండియా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం సెమీస్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ సింధు 21-13, 21-15 తేడాతో వరుస సెట్లలో మూడో ర్యాంకర్ ఇంతానన్ రచనోక్ (థాయిలాండ్)పై విజయం సాధించింది.
తొలి గేమ్‌లో 13-3తో ఆధిక్యంలో నిలిచిన సింధు ఆ తర్వాత అలవోకగా గేమ్ సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా.. సింధు అది కొద్దిసేపే. సుదీర్ఘమైన ర్యాలీలతో ప్రత్యర్థిని తెలివిగా బోల్తా కొట్టించిన 21-15తో రెండో గేమ్‌ను మ్యాచ్ గెలుచుకుంది.
ఆదివారం జరిగే ఫైనల్లో సింధు.. 11వ ర్యాంకర్ బీవెన్ జంగ్ (అమెరికా)తో తలపడనుంది. మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత పోరు ముగిసింది. సెమీస్‌లో ఎనిమిదో సీడ్ ప్రణవ్- సిక్కీ జోడీ 16-21, 19-21 తేడాతో ఐదో సీడ్ మతియాన్ క్రిస్టియాన్సెన్- క్రిస్టియన్నా (డెన్మార్క్) చేతిలో ఓటమి పాలైంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.