Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హాంకాంగ్ ఓపెన్: యమగూచిని ఓడించి సెమీ పైనల్స్‌కు సింధు

Sindhu storms into semifinals of Hong Kong Open

హైదరాబాద్: హాంకాంగ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీ భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో జపాన్‌ అగ్రశ్రేణి క్రీడాకారిణి అకానె యమగూచితో 19-21, 12-21 తేడాతో సింధు నెగ్గింది.

మ్యాచ్‌ ఆరంభం నుంచి సింధు దూకుడుగా ఆండింది. తొలి గేమ్‌లో ప్రత్యర్థి పుంజుకోవడానికి సింధు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో 21-12తో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. ఇక, రెండో గేమ్‌ మాత్రం ఇద్దరి మధ్య హోరాహోరీగా సాగింది.

ఉత్కంఠగా సాగిన ఈ గేమ్‌ను సింధు 21-19తో సొంతం చేసుకుని మ్యాచ్‌ని కూడా సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు వీరిద్దరూ ఆరు సార్లు తలపడగా చెరో మూడు మ్యాచ్‌లు గెలిచారు. ఈ ఏడాది అక్టోబరులో జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌లో యమగూచి చేతిలో సింధు ఓడిపోయిన సంగతి తెలిసిందే.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, November 24, 2017, 21:21 [IST]
Other articles published on Nov 24, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+