హాంకాంగ్ ఓపెన్: క్వార్టర్స్‌లో పీవీ సింధు

హైదరాబాద్: హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార‍్టర్స్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సింధు 21-14, 21-17 తేడాతో అయా ఒహోరి (జపాన్)పై గెలిచి క్వార్టర్స్‌లోకి అడుగు పెట్టింది.
ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచే సింధు పైచేయి సాధించింది. 39 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో సింధు వరుస గేముల్లో విజయం సాధించింది. తాజా విజయంతో ఒహారీపై ముఖాముఖి రికార్డును సింధు 3-0 మరింత మెరుగుపరుచుకుంది.
శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో సింధు చైనా ఓపెన్ విన్నర్ యమగూచితో తలపడనుంది. మరో మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ చైనాకు చెందిన చెన్ యుఫెయితో తలపడనుంది. ఇక, పురుషుల సింగిల్స్ విషయానికి వస్తే జపాన్‌కు చెందిన కుజుమ్సా కకాయితో హెచ్‌ఎస్ ప్రణయ్ తలపడనున్నాడు.
Story first published: Thursday, November 23, 2017, 17:38 [IST]
Other articles published on Nov 23, 2017
Read in English: Sindhu storms into quarterfinals
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications