Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డబ్ల్యూబిసి: సింధూకు పతకం ఖాయం, సైనా నిష్క్రమణ

డెన్మార్క్‌: ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌లో తెలుగుతేజం పివి సింధు సత్తా చాటింది. హోరా హోరీగా సాగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో సింధు విజయం సాధించింది. సెమిస్‌కు చేరి పతకం ఖాయం చేసింది. క్వార్టర్‌ ఫైనల్‌లో రెండో సీడ్‌ షిజియాన్‌ వాంగ్‌పై సింధు గెలుపొందింది.

ఆట ఆరంభం నుంచే సింధు చెలరేగి ఆడిన సింధు.. మొదటి గేమ్‌ కోల్పోయినా ఆ తర్వాత పుంజుకుంది. వరుసగా రెండు గేమ్స్‌లు గెలిచి మ్యాచ్‌ను ముగించింది. గత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన పివి సింధు, వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండు మెడల్స్‌ సాధించిన క్రీడాకారిణిగా సింధు రికార్డు నెలకొల్పింది.

Sindhu in semis at Worlds, Saina ousted

ముగిసిన సైనా పోరు

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌లో సైనా నెహ్వాల్‌ పోరు ముగిసింది. మరోసారి పతకం గెలవకుండానే ఇంటిదారి పట్టింది. క్వార్టర్‌ ఫైనల్‌లో సైనాపై టాప్‌ సీడ్‌ చైనా షెట్లర్‌ లీ జురుయ్‌ విజయం సాధించింది. 21-15, 21-15తో లీ సత్తా చాటింది. మ్యాచ్‌ ఆరంభం నుంచే సైనాపై చైనా షట్లర్‌ పైచేయి సాధించింది. రెండో గేమ్‌లో సైనా కాసేపు మెరుగ్గా అడినా లీ జురుయ్‌ ముందు నిలువలేకపోయింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+