జపాన్ ఓపెన్: ప్రీ క్వార్టర్స్‌కు సింధు, సైనా, శ్రీకాంత్
హైదరాబాద్: జపాన్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్లు సింధు, సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్, ప్రణయ్, సమీర్‌వర్మ ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్స్ కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, సమీర్ వర్మ... మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు.

మినత్సుపై సింధు విజయం
బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో నాలుగో సీడ్ సింధు 12-21, 21-15, 21-17తో మితాని మినత్సు (జపాన్)పై, సైనా 21-17, 21-9తో పోర్న్‌పావీ (థాయ్‌లాండ్)పై విజయం సాధించారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో 8వ సీడ్ శ్రీకాంత్ 21-15, 12-21, 21-11తో తియాన్ హూవీ (చైనా)పై, ప్రణయ్ 21-12, 21-14తో ఆండర్స్ ఆంటోన్సెన్ (డెన్మార్క్)పై, సమీర్ 21-12, 21-9తో ఖోసిత్ (థాయ్‌లాండ్)పై గెలుపొందారు.

ప్రీ క్వార్టర్స్‌లో సైనాతో మారన్, ఒకుహరతో సింధు
అయితే సాయిప్రణీత్ 23-21, 17-21, 14-21తో లీ డాంగ్ కెయున్ (కొరియా) చేతిలో, సౌరభ్ వర్మ 21-11, 15-21, 13-21తో లిన్ డాన్ (చైనా) చేతిలో ఓడిపోయారు. ఇక, గురువారం జరిగే ప్రిక్వార్టర్స్‌లో ఐదో సీడ్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సైనా, ఒకుహరతో సింధు పోటీపడతారు.

గత మ్యాచ్‌ల ఫలితాలిలా ఉన్నాయి
ఇప్పటివరకు సైనా, మారిన్ ఏడుసార్లు తలపడగా.. నాలుగింటిలో సైనా, మూడింట్లో మారిన్ పైచేయి సాధించింది. ఇక సింధు, నొజోమి ఒకుహర 8 మ్యాచ్‌ల్లో నాలుగేసి విజయాలతో సమంగా ఉన్నారు. ఇక పురుషుల విషయానికి వస్తే హు యున్ (హాంకాంగ్)తో శ్రీకాంత్, సు జెన్ హావో (చైనీస్ తైపీ)తో ప్రణయ్, షి యుకి (చైనా)తో సమీర్ వర్మ ఆడనున్నారు.

మిక్స్‌డ్ డబుల్స్ సాత్విక్- అశ్విని జోడీ రెండో రౌండ్‌లోకి
మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్- అశ్విని 21-17, 21-13తో టిన్ ఇష్రియానెత్- చోచువాంగ్ (థాయ్‌లాండ్)పై గెలిచారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాత్విక్- చిరాగ్‌శెట్టి 25-27, 15-21తో మార్కస్- కెవిన్ (ఇండోనేసియా) చేతిలో, సుమీత్‌రెడ్డి- మను అత్రి 18-21, 15-21తో లీ హువీ- లీ యాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications