జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్: ఫైనల్లో సింధు vs సైనా

హైదరాబాద్: అందరూ ఊహించినట్టే 83వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ ఫైనల్లో స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు అమీతుమీ తేల్చుకోనున్నారు. గతేడాది ఫైనలిస్టులు సైనా నెహ్వాల్, పీవీ సింధు ఈఏడాది కూడా మహిళల సింగిల్స్ ఫైనల్స్‌కు అర్హత సాధించారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి సెమీఫైనల్లో టాప్‌సీడ్ సింధు 21-10, 22-20తో అసోం షట్లర్ అస్మితా చాలిహాపై విజయం సాధించింది.

సైనాతో పోటీపై సింధు మాట్లాడుతూ
సెమీస్ మ్యాచ్ ఆద్యంతం అస్మితను నిలువరించేందుకు సింధు కష్టపడాల్సి వచ్చింది. సొంత ప్రేక్షకుల మద్దతుతో రెండో గేమ్‌లో అస్మిత దాదాపు గెలిచినంత పని చేసినా.. సింధు తన అనుభవంతో గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. సైనాతో పోటీపై సింధు మాట్లాడుతూ "నా విషయానికొస్తే సైనాతో ఫైనల్ మరో మ్యాచ్ లాంటిదే. ఈ మ్యాచ్ ఆల్ ఇంగ్లండ్ సన్నాహాలకు ఉపయోగపడదు. నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా" అని తెలిపారు.

గతేడాది జరిగిన ఫైనల్లో సింధును ఓడించిన సైనా
ఇక, రెండో సెమీఫైనల్లో రెండోసీడ్, డిఫెండింగ్ చాంపియన్ సైనా 21-15, 21-14తో నాగపూర్‌కు చెందిన క్వాలిఫయర్ వైష్ణవి భాలేపై విజయం సాధించింది. గతేడాది జరిగిన ఫైనల్లో సింధును ఓడించిన సైనా చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. గతంలో సైనా 2006, 2007లలో కూడా ఈ టైటిల్‌ను సాధించింది. సింధు 2011, 2013లలో జాతీయ చాంపియన్‌గా నిలిచింది.

పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ vs సౌరభ్ వర్మ
పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్ (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా), సౌరభ్ వర్మ (పీఎస్‌పీబీ) టైటిల్ కోసం తలపడతారు. తొలి సెమీస్‌లో సౌరభ్ 21-14, 21-17తో కౌశల్ ధర్మవీర్‌పై గెలిచాడు. మరో సెమీస్‌లో యువ సంచలనం లక్ష్యసేన్ 21-15, 21-16తో అనుభవజ్ఞుడైన పారుపల్లి కశ్యప్‌కు షాకిచ్చి రెండోసారి టోర్నీలో ఫైనల్‌కు చేరాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో తెలుగు అమ్మాయి కె. మనీష (ఆర్‌బీఐ)-మనూ అత్రి (పీఎస్‌పీబీ) జోడీ ఫైనల్లోకి ప్రవేశించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications