నేటి నుంచి డెన్మార్క్ ఓపెన్: మరో సవాల్‌కు సిద్ధమైన సైనా, సింధు

ఒడెన్స్: భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు మరో టోర్నీకి సిద్ధమయ్యారు. ఈ ఏడాది భారత బ్యాడ్మింటన్‌లో లోటుగా ఉన్న అంతర్జాతీయ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో సైనా నెహ్వాల్, పీవీ సింధు డెన్మార్క్ ఓపెన్‌కు సిద్ధమయ్యారు. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే డెన్మార్క్ ఓపెన్‌లో వీరిద్దరూ టైటిల్‌పై గురి పెట్టారు.
మహిళల సింగిల్స్‌లో మూడోసీడ్‌గా సింధు, అన్‌సీడెడ్ హోదాతో సైనా ఈ టోర్నీలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తొలిరౌండ్‌లో అమెరికా షట్లర్ జాంగ్‌తో సింధు తలపడనుండగా.. హాంకాంగ్‌కు చెందిన చెంగ్ ఎన్‌జాన్ యీతో సైనా పోటీపడనుంది. ఈ టోర్నీలో సైనా, సింధు ఇద్దరికీ కఠినమైన 'డ్రా' పడింది.
ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ అకానె యామగుచి (జపాన్)తో సైనా
తొలి రౌండ్‌లో విజయం సాధిస్తే, ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ అకానె యామగుచి (జపాన్)తో సైనా... అయా ఒహోరి (జపాన్)తో సింధు ఆడే అవకాశముంది. ఇక, రెండో రౌండ్‌ను దాటితే క్వార్టర్స్‌లో ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు... మాజీ ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో సైనా తలపడే అవకాశం ఉంది.

హాన్స్ క్రిస్టియాన్‌తో తలపడనున్న కిదాంబి శ్రీకాంత్
ఇక, పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్, సాయిప్రణీత్, సమీర్ వర్మ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ డెన్మార్క్‌కు చెందిన హాన్స్ క్రిస్టియాన్‌తో తలపడనున్నాడు. చైనాకు చెందిన హుయాంగ్ గ్జియాంగ్ తో సాయిప్రణీత్, చైనాకు చెందిన సీ యుకీతో సమీర్ వర్మ అమీతుమీ తేల్చుకోనున్నాడు.

టోర్నీలో ఆడే అవకాశాన్ని చేజార్చుకున్న పారుపల్లి కశ్యప్
కొరియాకు చెందిన సన్ వాన్ హో రూపంలో తొలిరౌండ్‌లో కఠినమైన ప్రత్యర్థితో హెచ్‌ఎస్ ప్రణయ్ పోటీ పడనున్నాడు. పాస్‌పోర్టు పోగొట్టుకున్న పారుపల్లి కశ్యప్ ఈ టోర్నీలో ఆడే అవకాశాన్ని కూడా చేజార్చుకున్నాడు. పురుషుల డబుల్స్‌లో భారత సూపర్ జోడీ మను అత్రి, సుమీత్‌రెడ్డి జోడీ తొలిరౌండ్‌లో డెన్మార్క్ జోడి కిమ్ ఆస్ట్రుప్, ఏండెర్స్ స్కారుప్‌తో తలపడనున్నారు.
ఇక, మహిళల డబుల్స్‌లో భారత స్టార్ జోడీ అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి జోడీ .. అమెరికాకు చెందిన అరియల్ లీ, సిడ్నీ లీ తో పోటీ పడనున్నారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-సాత్విక్ సాయిరాజ్ బరిలోకి దిగనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications