న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వర్ణానికి అడుగు దూరంలో: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో పీవీ సింధు

Sindhu outclasses Chen Yufei; storms into final of the BWF World Championships

హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీస్‌లో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మహిళల సింగిల్స్‌లో భాగంగా చైనా క్రీడాకారిణి చెన్‌ యు ఫీతో జరిగిన మ్యాచ్‌లో 21-7, 21-14 తేడాతో చిత్తుగా ఓడించింది.

మూడోసారి ఫైనల్‌‌కు

మూడోసారి ఫైనల్‌‌కు

ఫలితంగా వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌ చేరింది. కేవలం 39 నిమిషాల్లోనే వరుస గేమ్‌ల్లో ప్రత్యర్ధిని చిత్తు చేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు నాలుగు పతకాలు గెలిచిన సింధు... స్వర్ణం మాత్రం నెగ్గలేదు. అయితే, ఈసారి ఎలాగైనా స్వర్ణ పతకాన్ని గెలవాలి ఉవ్విళ్లూరుతోంది.

పూర్తిగా తేలిపోయిన చెన్

పూర్తిగా తేలిపోయిన చెన్

సెమీస్‌లో భాగంగా జరిగిన తొలి గేమ్‌లో చైనా క్రీడాకారిణి చెన్‌ యు ఫీ పూర్తిగా తేలిపోయింది. సుదీర్ఘ ర్యాలీలతో చుక్కలు చూపించింది. తొలిగేమ్‌లో 4-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన సింధు... ఆ తర్వాత వరుసగా నాలుగు పాయింట్లు సాధించింది. దీంతో ఆధిక్యం 8-2కు పెరిగింది. ఆ తర్వాత సింధు మరింత దూకుడుగా ఆడి పాయింట్ల ఆధిక్యాన్ని 14-3కు పెంచుకుంది.

పూర్తి ఆత్మవిశ్వాసంతో

పూర్తి ఆత్మవిశ్వాసంతో

అదే జోరుని కొనసాగిస్తూ 21-7తో గేమ్‌ని సొంతం చేసుకుంది. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న సింధు అదే ఊపులో రెండో గేమ్‌లో కూడా కొనసాగించింది. ఒకానొక దశలో ఇద్దరూ 3-3తో సమం అయ్యారు. ఆ తర్వాత 5-4 వద్ద ఏకంగా 36 షాట్ల సుదీర్ఘ ర్యాలీ ఆడారు. సింధు మాత్రం తన అనుభవాన్ని ఉపయోగించి అనవసర తప్పిదాలు చేయలేదు.

అనవసర తప్పిదాలు చేసిన చెన్

అనవసర తప్పిదాలు చేసిన చెన్

మరోవైపు చెన్‌ తప్పిదాలు చేయడంతో సింధుకు కలిసొచ్చింది. దీంతో చివరికి 21-14తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకుంది.

Story first published: Saturday, August 24, 2019, 16:28 [IST]
Other articles published on Aug 24, 2019
Read in English: Sindhu in Worlds final
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X