
హైదరాబాద్: అంతర్జాతీయ క్రీడాకారిణి, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పేరిట స్వయంగా ఒక యాప్‌ను ఆవిష్కరించారు. డిసెంబరు 27 బుధవారం ఈ యాప్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు ఆమె తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

'హాయ్.. నా పేరుతో బ్యాడ్మింటన్ యాప్‌ను ఆవిష్కరించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ యాప్ ఐఓఎస్, ఆండ్రాయిడ్ రెండు వర్షన్‌లలోనూ అందుబాటులో ఉంది. యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని త్వరగా నాతో కనెక్ట్ అవ్వండి అని ఆ సందేశం యొక్క సారాంశం. '
యాప్‌లో సింధు వ్యక్తిగత(పర్సనల్) విషయాలు కూడా పొందుపరుస్తారట.
ఈ యాప్‌ను వాడుతుండటం ద్వారా సింధు వీడియోలు, ఏ రోజు ఎక్కడ మ్యాచ్ ఆడుతుందన్న విశేషాలు, ఆవిడ అభిమానులతో పంచుకునే అభిప్రాయాలు అన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశముంది. ఈ యాప్‌లో తన మొదటి వీడియోను ఉంచిన పీవీ సింధు అభిమానులు, వినియోగదారులకు స్వాగతం అంటూ తనే చెప్పింది.గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లలో ఈ యాప్ అందుబాటులో ఉంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.