Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కొరియా ఓపెన్: సింధు, కశ్యప్, సాయి ప్రణీత్ శుభారంభం

హైదరాబాద్: కెరీర్‌లో మూడో సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ లక్ష్యంగా కొరియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో బరిలోకి దిగిన భారత స్టార్‌ పీవీ సింధు తొలిరౌండ్‌ను అలవోకగా అధిగమించింది. ప్రపంచ చాంపియన్‌షిప్ రజత పతక విజేతైన సింధు మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో 21-13, 21-8తో హాంకాంగ్ షట్లర్ చెంగ్ గాన్ యిపై విజయం సాధించి ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.

ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో సింధు 34 నిమిషాల్లో ప్రత్యర్థిని ఇంటిబాట పట్టించింది. మొత్తంగా చెయుంగ్‌పై సింధుకిది వరుసగా ఐదో విజయం కావడం విశేషం. తొలి గేమ్‌ ఆరంభంలో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడినా రెండో గేమ్‌లోనైతే సింధు ధాటికి చెయుంగ్‌ ఎదురునిలువలేకపోయింది.

గురువారం జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 16వ ర్యాంకర్‌ నిచావోన్‌ జిందాపోల్‌ (థాయ్‌లాండ్‌)తో సింధు తలపడుతుంది. నిచావోన్‌తో ముఖాముఖి రికార్డులో 1-1తో సమంగా ఉన్న సింధు.. ప్రీక్వార్టర్స్‌ను అధిగమిస్తే క్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ థాయ్ జూ యింగ్‌తో తలపడనుంది.

పురుషుల సింగిల్స్‌లో మిశ్రమ ఫలితాలు

పురుషుల సింగిల్స్‌లో మిశ్రమ ఫలితాలు

పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఇక పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్లలో హెచ్‌ఎస్‌ ప్రణయ్, సౌరభ్‌ వర్మ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించగా, క్వాలిఫయర్‌ పారుపల్లి కశ్యప్, భమిడిపాటి సాయిప్రణీత్, సమీర్‌ వర్మ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు.

కశ్యప్, సాయి ప్రణీత్ శుభారంభం

కశ్యప్, సాయి ప్రణీత్ శుభారంభం

కశ్యప్‌ 21-13, 21-16తో ప్రపంచ 28వ ర్యాంకర్‌ సు జెన్‌ హావో (చైనీస్‌ తైపీ)పై, సాయిప్రణీత్‌ 21-15, 21-10తో హు యున్‌ (హాంకాంగ్‌)పై, సమీర్‌ వర్మ 21-13, 21-23, 21-9తో ప్రపంచ 13వ ర్యాంకర్‌ తనోంగ్‌సక్‌ సెన్‌సోమ్‌బూన్‌సుక్‌ (థాయ్‌లాండ్‌)పై విజయం సాధించారు.

రెండో రౌండ్లో కశ్యప్‌కు గట్టి పోటీ

రెండో రౌండ్లో కశ్యప్‌కు గట్టి పోటీ

ప్రపంచ నంబర్‌వన్ సన్ వాన్ హో (కొరియా)తో కశ్యప్ రెండోరౌండ్ ఆడనున్నాడు. మిగతా మ్యాచుల్లో సమీర్ వర్మ 21-13, 21-23, 21-9తో థాయ్‌లాండ్‌కు చెందిన 8వ సీడ్ తనోంగ్‌సాక్ సేన్‌సోబూన్సాక్‌ను చిత్తుచేయగా.. సాయి ప్రణీత్ 21-15, 21-10తో హూ యన్ (హాంకాంగ్)పై గెలుపొందాడు.

వాంగ్ జూ వీ (చైనీస్ తైపీ)తో సాయి ప్రణీత్

వాంగ్ జూ వీ (చైనీస్ తైపీ)తో సాయి ప్రణీత్

ప్రీక్వార్టర్స్‌లో వాంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)తో సమీర్, ఏడోసీడ్ వాంగ్ జూ వీ (చైనీస్ తైపీ)తో సాయి ప్రణీత్ తలపడనున్నారు. ప్రణయ్ 17-21, 23-21, 14-21తో నాంగ్ కా లాంగ్ ఆగ్నస్ (హాంకాంగ్) చేతిలో ఓడగా, క్వాలిఫయర్ కెంటా నిషిమొటో (జపాన్) 18-21, 21-13, 21-19తో సౌరభ్ వర్మకు షాకిచ్చాడు.

డబుల్స్‌లో సాత్విక్ జోడీ మినహా

డబుల్స్‌లో సాత్విక్ జోడీ మినహా

ఇక, డబుల్స్‌లో సాత్విక్ జోడీకి మినహా మిగతా భారత షట్లర్లకు తొలిరోజే నిరాశ ఎదురైంది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌రాజ్ రాంకీరెడ్డి-చిరాగ్ శెట్టి జోడీ 21-9, 22-24, 21-12తో చైనీస్ తైపీ జంట లీ షెంగ్-లిన్ చియాపై గెలిచి రెండోరౌండ్ చేరింది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి జంట, మిక్స్‌డ్ డబుల్స్‌లో సాత్విక్‌రాజ్-అశ్విని జోడీ ప్రత్యర్థుల చేతిలో ఓడి తొలిరౌండ్లోనే వెనుదిరిగారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+