For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వియత్నాం ఓపెన్: ఫైనల్‌కు దూసుకెళ్లిన అజయ్‌ జయరాం

By Nageshwara Rao
Shuttler Ajay Jayaram enters Vietnam Open final

హైదరాబాద్: హొ చిన్‌ మిన్‌ సిటీ వేదికగా జరుగుతున్న వియత్నాం ఓపెన్‌ టూర్ 100 టోర్నీ భారత షట్లర్‌ అజయ్‌ జయరాం ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో జయరాం 21-14, 21-19 యు ఇగర్‌షి(జపాన్‌)పై విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు.

ఆదివారం జరిగే పురుషుల ఫైనల్స్‌లో జయరాం ఇండోనేషియాకు చెందిన రుస్తావితోతో తలపడనున్నాడు. 38 నిమిషాల పాటు జరిగిన పోరులో జయరాం అద్భుత ప్రదర్శన చేశాడు. తొలి గేమ్‌లో 21-14తో కైవసం చేసుకున్న జయరాం ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు.

ఇక, రెండో గేమ్‌ ఇద్దరి మధ్య ఆసక్తికరంగా సాగింది. హోరాహోరీగా సాగిన ఈ గేమ్‌లో ఇద్దరూ పాయింట్ల కోసం పోటీపడ్డారు. కానీ చివరకు తన అనుభవాన్ని ఉపయోగించి రెండో గేమ్‌ను సొంతం చేసుకోవడంతో పాటు మ్యాచ్‌లో విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లాడు.

మరో ఆటగాడు మిథున్‌ సెమీస్‌లో పరాజయం పాలయ్యాడు. సెమీఫైనల్లో మిథున్‌ 17-21, 21-19, 14-21తో రుస్తావితో(ఇండోనేషియా) చేతిలో ఓటమిపాలయ్యాడు.

Story first published: Saturday, August 11, 2018, 17:38 [IST]
Other articles published on Aug 11, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+