For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సైనా నెహ్వాల్ బయోపిక్‌లో బాలీవుడ్ హీరోయిన్

 Shraddha Kapoor from Saina Nehwal biopic proves why she was roped in for the role

న్యూ ఢిల్లీ: అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నేహ్వాల్ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అమోల్ గుప్తే తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ టైటిల్ రోల్‌లో నటిస్తోంది. సెప్టెంబర్ 22 నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఈ సినిమా వైపు ప్రేక్షకుల దృష్టిని మళ్లించడానికి శ్రద్ధా కపూర్ ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

బ్యాడ్మింటన్ రాకెట్ పట్టుకుని విజయాన్ని ఆస్వాదిస్తున్న సైనా లుక్‌లో శ్రద్ధా కపూర్ అదిరిపోయింది. అచ్చం సైనాలానే కనిపిస్తోంది. వాస్తవానికి, సైనా నెహ్వాల్‌లా కనిపించడానికి శ్రద్ధా కపూర్ చాలా కష్టపడింది. సైనాలా కనిపించడానికి పళ్ల వరుసను కూడా సరిచేయించుకుంది. కొద్ది నెలలుగా బ్యాడ్మింటన్ క్రీడను నేర్చుకుంటోంది. 2010 కామన్వెల్త్ క్రీడల్లో సైనా నెహ్వాల్ బంగారు పతకం సాధించింది. అలాగే 2012 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకుంది.

ప్రపంచ నంబర్ 1 ర్యాంక్ సాధించిన ఏకైక భారత మహిళా బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా. 2015లో ఈ ఘనత సాధించింది. ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు సైనా బయోపిక్‌లో చూపించనున్నారు. సైనా పాత్ర కోసం పుల్లెల గోపీచంద్ వద్దే శ్రద్ధా కపూర్ బ్యాడ్మింటన్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. సైనా కామ‌న్వెల్త్ గేమ్స్‌లో రెండు బంగారు ప‌తకాలు సాధించిన తొలి భార‌తీయ బ్యాడ్మింట‌న్‌ క్రీడాకారిణిగా నిలిచిన సంగ‌తి తెలిసిందే

'బయోపిక్ కోసం సిద్ధం కావడానికి నేను ఇప్పటికే 40 బ్యాడ్మింటన్ క్లాసులకు హాజరయ్యాను. ఇది చాలా కష్టమైన క్రీడ. కానీ నేను ఆస్వాదిస్తున్నాను. సైనా జీవిత ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉంది. ఆమె గాయాలతో వైదొలగడం దగ్గర నుంచి విజయాలు అందుకోవడం వరకూ ప్రతీది ఆసక్తికరమే. నేనూ ఇలాంటి ఆటుపోట్లు ఎన్నో చూశాను. అందుకే ఆమె ప్రయాణాన్ని నా ప్రయాణంగా భావించి నటిస్తున్నాను' అని శ్రద్ధ చెప్పుకొచ్చింది.

Story first published: Saturday, September 29, 2018, 14:41 [IST]
Other articles published on Sep 29, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+