Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సింధుపై కామెంట్స్: శోభా డేపై విరుచుకపడ్డ అమితాబ్

హైదరాబాద్: ఒలింపిక్స్ వెళ్లిన భారత క్రీడాకారులపై సంచలన వ్యాఖ్యలు చేసిన కాలమిస్టు శోభాడేపై బిగ్‌బి అమితాబ్ బచ్చన్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. రియోలో భారత క్రీడాకారులు సెల్ఫీలు తీసుకోవడంలో చూపిస్తున్న ఆసక్తి, పతకాలు సాధించడంలో చూపించడం లేదుని శోభాడే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే.

అయితే అప్పుడు ఎవరూ పెద్దగా స్పందించలేదు. రియో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు ఒక్క పతకమైన సాధిస్తారా అనే అనుమానం వల్ల అలా జరిగి ఉండవచ్చు. తాజాగా సెమీస్ నెగ్గి ఫైనల్స్‌కి చేరిన సింధుని ఉద్దేశించి 'సిల్వర్ ప్రిన్సెస్' అని తన ట్విట్లర్ ఖాతాలో శోభా డే పోస్ట్ చేశారు.

Shobha dey comments on Sindhu: Amitabh retaliates

అయితే దీనికి అమితాబ్ తీవ్రంగా స్పందించారు. 'మీరు ఖాళీ చేతులతో కాదు, మెడల్‌తో తిరిగి వస్తున్నారు. మీతో సెల్ఫీ తీసుకోవాలనుంది' అని సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా అతిగా వాగే వాళ్ల నోర్టు మూయించారని అన్నారు. కొన్ని పనులు పెన్నులను కూడా ఓడిస్తాయని తన ట్విట్టర్‌లో అమితాబ్ వ్యాఖ్యానించారు.

శోభా డే కాలమిస్టు కాబట్టి ఆమె వ్యాసాలు రాస్తుంటారు కాబట్టి కొన్ని పనులు పెన్నులను కూడా ఓడిస్తాయని అమితాబ్ నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+