ముంబై: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్.. భారత బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానాన్ని ట్విట్టర్ సందేశాల ద్వారా చాటుకుంటున్నారు. ఒకరిపై ఒకరు ప్రశంసల వర్షం కురిపించుకుంటున్నారు.
'బ్యాడ్మింటన్‌లో తాను షారుఖ్ అంత ఎత్తుకు ఎదగాలనుకుంటున్నాను' అని సైనా చేసింది.
ఆ ట్వీట్‌కు స్పందించిన షారుఖ్.. 'సినిమాల్లో నేను సైనా లాగా దూసుకెళ్లాలి' అని రాశాడు.
ఇటీవలే 'దిల్‌వాలే' సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌కు వచ్చిన షారుఖ్ ఖాన్‌ను కలవాలనుకుంటున్నట్లు సైనా తన మనసులోని మాట బయటపెట్టింది.

దీనికి వెంటనే స్పందించిన బాలీవుడ్ సూపర్‌స్టార్ స్వయంగా సైనాకు ఫోన్ చేసి షూటింగ్ లొకేషన్‌కు రమ్మని ఆహ్వానించారు. చాలా సేపు ఈ ఇద్దరు కలిసి సెల్ఫీలతో షూటింగ్‌లో సందడి చేయగా, సైనా తన రాకెట్‌ను షారుఖ్‌కు గిఫ్ట్‌గా ఇచ్చింది.