చరిత్రకు అడుగుదూరంలో సింధు: ఫైనల్లో కరోలినా మారిన్‌తో పోరు

హైదరాబాద్: చైనాలోని నాన్‌జింగ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో తెలుగు తేజం పీవీ సింధు ఫైనల్లోకి దూసుకెళ్లింది. దీంతో విశ్వవిజేతగా నిలిచేందుకు పీవీ సింధు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. అంతేకాదు వరుసగా రెండో ఏడాది సింధు స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది.
ఫైనల్లో స్పెయిన్‌కు చెందిన రెండుసార్లు (2014, 2015) విశ్వవిజేత, 2016 రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు తలపడనుంది. ఈ టోర్నీ చరిత్రలో వరుసగా ఐదోసారి బరిలోకి దిగి నాలుగోసారి పతకాన్ని ఖాయం చేసుకున్న సింధు పసిడి పోరుకు సిద్ధమైంది.
మరో సెమీఫైనల్లో ఏడో సీడ్ కరోలినా మారిన్ 13-21, 21-16, 21-13తో హీ బింగ్‌జియావో (చైనా)పై విజయం సాధించింది. మారిన్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 5-6తో వెనుకంజలో ఉంది. అయితే మారిన్‌తో జరిగిన గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడుసార్లు సింధునే గెలుపొందడం విశేషం.
వరుస గేముల్లో విజయం సాధించిన సింధు
శనివారం జరిగిన రెండో సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్, జపాన్‌కు చెందిన అకానె యామగుచిపై 21-16, 24-22తో వరుస గేముల్లో విజయం సాధించింది. గతేడాది దుబాయ్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో... ఈ ఏడాది ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ సెమీఫైనల్లో యామగుచి చేతిలో ఓడిపోయిన సింధుకు ఈసారీ గట్టిపోటీనే ఎదురైంది. 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు గేముల్లోనూ సింధు తొలుత వెనుకబడి ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని విజయం సాధించింది.

అనవసర తప్పిదాలు
తొలి గేమ్ ఆరంభంలో అనవసర తప్పిదాలతో సింధు వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయింది. ఈ క్రమంలో వరుసగా పాయింట్లు సాధించిన సింధు 8-8తో స్కోరు సమం చేసింది. ఆ తర్వాత 12-12 వరకు ఇద్దరూ చెరో పాయింట్ సాధిస్తూ పోయారు. అనూహ్యం పుంజుకున్న సింధు ఆ తర్వాత చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు సాధించి 18-12లో ఆధిక్యంలో కనిపించిన సింధు.. చివరికి 21-16తో గేమ్‌ను కైవసం చేసుకుంది.
హోరాహోరీగా పోరాడినా సింధు, యమగూచి
ఇక, రెండో గేమ్ మాత్రం సుదీర్ఘ ర్యాలీలు, ప్లేస్‌మెంట్లతో రెండో గేమ్ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. రెండో గేమ్‌లోనూ తొలుత యామగుచినే ఖాతా తెరిచింది. పాయింట్ల కోసం ఇద్దరూ హోరాహోరీగా పోరాడినా ఎక్కువసార్లు యామగుచినే పైచేయి సాధించింది. ఓ దశలో యామగుచి 19-12కు ఆధిక్యంలో నిలిచి రెండో గేమ్‌ను నెగ్గేలా కనిపించింది. కానీ, మళ్లీ పుంజుకున్న సింధు 19-19తో స్కోరు సమం చేసింది.

20-20 స్కోరు సమం
అయితే యామగుచి తర్వాతి పాయింట్‌ను సాధించి స్కోరును 20-20తో సమం చేసింది. స్కోరు 22-21 వద్ద 41 షాట్‌లతో కూడిన ర్యాలీని యామగుచి గెలిచి మళ్లీ స్కోరును 22-22తో సమం చేసింది. చివరకు సింధు 23-22తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత యామగుచి కొట్టిన షాట్ బయటకు వెళ్లడంతో సింధు ఖాతాలో మరో పాయింట్ నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. కీలకమైన క్వార్టర్స్, సెమీస్ మ్యాచ్‌ల్లో సింధు జపాన్ క్రీడాకారిణులను ఓడించటం విశేషం.
ఫైనల్స్ ఆదివారం ఉదయం గం. 10.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications