న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉద్రిక్త పరిస్థితులు.. భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్ వాయిదా

Security review: ITF postpone Indias Davis Cup tie against Pakistan to November

ఢిల్లీ: పాకిస్థాన్‌తో జరగాల్సిన భారత డేవిస్‌ కప్‌ మ్యాచ్‌ వాయిదా పడింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) డేవిస్‌ కప్‌ మ్యాచ్‌ను వాయిదా వేస్తున్నట్లు గురువారం ఓప్రకటనలో తెలిపింది. షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్ 14, 15 తేదీల్లో ఇస్లామాబాద్‌లో భారత్‌, పాక్‌ మ్యాచ్ ఆడాల్సి ఉండేది. కానీ.. రెండు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడడంతో ఆ మ్యాచ్‌ను తటస్థ వేదికలో నిర్వహించాలని ఐటీఎఫ్‌ను భారత్‌ కోరింది. సమావేశం నిర్వహించిన ఐటీఎఫ్‌.. డేవిస్‌ కప్‌ కమిటీ వేదికను మార్చకుండా మ్యాచ్‌ను వాయిదా వేసింది. అయితే ఆ మ్యాచ్ జరిగే తేదీలు సెప్టెంబర్ 9లోపు ప్రకటిస్తామని ఐటీఎఫ్‌ అధికారులు తెలిపారు.

సైనిక సేవ ముగిసింది.. రాజకీయ నాయకుడిగా ధోనీ కొత్త అవతారం!!

'పాకిస్థాన్‌లో భద్రతపరమైన విషయాలపై అందరం చర్చించాం. ప్రస్తుత పరిస్థితులను పరిశీలించిన అనంతరం ఇస్లామాబాద్‌లో భారత్‌తో జరగాల్సిన గ్రూప్‌-1 మ్యాచును వాయిదా వేయాలని కమిటీ నిర్ణయించింది. నవంబర్‌లో ఈ పోరు జరగనుంది. మ్యాచ్ తేదీలను సెప్టెంబర్ 9లోపు ప్రకటిస్తాం' అని ఐటీఎఫ్‌ అధికారి ఒకరు తెలిపారు. భారత క్రికెట్ జట్టు చివరి సారిగా 2007లో పాకిస్థాన్‌లో పర్యటించింది. తరువాత దేశంలోని ఏ క్రీడలోనూ ఏ జట్టు పాకిస్తాన్‌లో పర్యటించలేదు.

1964 తర్వాత భారత డేవిస్‌కప్‌ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించనుండటం ఇదే తొలిసారి. చివరిగా అక్కడ ఆడినప్పుడు భారత్‌ 4-0తో విజయం సాధించింది. డేవిస్‌ కప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ 6-0తో తిరుగులేని ఆధిక్యంలో ఉంది. డేవిస్‌కప్‌ కోసం 55 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత భారత జట్టు పాకిస్థాన్‌ వెళ్లబోతోంది. 1964 తర్వాత భారత డేవిస్‌కప్‌ జట్టు పాక్‌లో పర్యటించనుండటం ఇదే తొలిసారి.

<strong>సాయిప్రణీత్‌ సంచలనం.. ప్రిక్వార్టర్స్‌లో ఓడిన శ్రీకాంత్, సైనా</strong>సాయిప్రణీత్‌ సంచలనం.. ప్రిక్వార్టర్స్‌లో ఓడిన శ్రీకాంత్, సైనా

Story first published: Friday, August 23, 2019, 11:15 [IST]
Other articles published on Aug 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X