Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నెరవేరిన భారత్ చిరకాల స్వప్నం: చరిత్ర సృష్టించిన స్టార్ ప్లేయర్లు

Satwiksairaj Rankireddy and Chirag Shetty win bronze in Badminton World Championships

టోక్యో: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తన కలను సాకారం చేసుకుంది. 11 సంవత్సరాల తరువాత మరోసారి పతకాన్ని ముద్దాడింది. 2011 తరువాత మళ్లీ పతకాన్ని అందుకోవడం ఇదే తొలిసారి. బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్లు సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ద్వయం ఈ ఘనతను సాధించింది. తమ పతకాన్ని వెండి లేదా బంగారంగా మార్చుకోవడానికి అవకాశం లభించినప్పటికీ.. దాన్ని సద్వినియోగం చేసుకోవడం కాసింత నిరాశ పర్చినప్పటికీ.. చిరకాల స్వప్నాన్ని నెరవేర్చడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి.

రజతంతో..

రజతంతో..

టోక్యోలో జరుగుతోన్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ షెట్టి ద్వయం జైత్రయాత్రకు బ్రేక్ పడింది. పురుషుల డబుల్స్ సెమీఫైనల్స్‌లో వారు ఓడిపోయారు. మలేసియాకు చెందిన ఆరోన్ చియా-సోహ్ వుయ్ యిక్ చేతిలో 22-20, 18-21, 16-21 తేడాతో పరాజయాన్ని చవి చూశారు. ఈ ఓటమితో ఈ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

తొలి సెట్ గెలిచినా..

రంకిరెడ్డి-చిరాగ్ షెట్టి తొలి సెట్‌ను 22-20 స్కోర్ తేడాతో గెలిచినప్పటికీ- దాన్ని కొనసాగించలేకపోయారు. తమ ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ- భారత ప్లేయర్లు వ్యూహాత్మకంగా అడ్డుకోగలిగారు. మెరుపుల్లాంటి షాట్లతో ఎదురుదాడికి దిగారు. తిరుగులేని స్మాషింగ్ షాట్లను ఆడారు. తొలిసెట్‌ను కైవసం చేసుకున్నారు. ఈ ఇద్దరి దూకుడుకు మలేసియన్ ప్లేయర్లు ఆ తరువాతి సెట్లల్లో సమర్థవంతంగా అడ్డుకోగలిగారు. తొలి సెట్‌లో వెనుకబడ్డ ఆరోన్ చియా-సోహ వుయి యిక్ ఆ తరువాత పుంజుకొన్నారు.

సమవుజ్జీగా నిలిచినా..

సమవుజ్జీగా నిలిచినా..

రెండు మూడు సెట్లను 21-18, 21-16 తేడాతో గెలుుకున్నారు. మూడో గేమ్‌లో భారత ద్వయం పుంజుకొంది. పోటీపోటీగా పోరు సాగింది. 11 గేమ్స్ వరకు సమవుజ్జీగా నిలిచాయి రెండు జట్లు. 11-11తో సమంగా ఉన్న సమయంలో మలేసియన్ ప్లేయర్లు ముందడుగు వేశారు. దూకుడుగా ఆడారు. రంకిరెడ్డి-చిరాగ్ షెట్టి ద్వయాన్ని కోర్ట్ నలుమూలలా పరుగులు పెట్టించారు. 11వ గేమ్ నుంచి తమ ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోయారు.

గుత్తా జ్వాలా-అశ్విని పొన్నప్ప తరువాత..

గుత్తా జ్వాలా-అశ్విని పొన్నప్ప తరువాత..

చివరికి ఈ గేమ్‌ను 21-16 తేడా సొంతం చేసుకోవడంతో భారత్ పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదీ రికార్డే. ఇప్పటివరకు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ పురుషుల డబుల్స్‌లో పతకాన్ని సాధించలేదు.ఈ కేటగిరీలో మెడల్‌ను కొట్టడం ఇదే తొలిసారి. కాగా ఇదివరకు గుత్తా జ్వాలా-అశ్విని పొన్నప్ప ఈ ఘనతను సాధించారు. 2011లో మహిళల డబుల్స్ కేటగిరీలో వారు రజతం సాధించారు. ఆ తరువాత మళ్లీ భారత్‌కు మెడల్ రావడం ఇదే తొలిసారి.

Story first published: Saturday, August 27, 2022, 11:03 [IST]
Other articles published on Aug 27, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+