ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ మెన్స్ డబుల్స్ ఫైనల్‌లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్‌శెట్టి జోడీ ఓటమిపాలైంది. దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ ఛాంపియన్ సియో సీయుంగ్- కాంగ్ మిన్ జంట చేతిలో 21-15, 11-21, 18-21 తేడాతో పరాజాయాన్ని చవిచూసి రన్నరప్‌గా నిలిచింది. అయితే టోర్నీ ఫైనల్‌కు చేరి తుది మెట్టుపై బోల్తాపడి టైటిల్ చేజార్చుకోవడం సాత్విక్- చిరాగ్ జోడీకి ఇది వరుసగా మూడో సారి కావడం గమనార్హం.
జనవరి ఆరంభంలో మలేషియా ఓపెన్ ఫైనల్‌లో, గతేడాది నవంబర్‌లో జరిగిన చైనా మాస్టర్స్ ఈవెంట్‌లో సాత్విక్ సాయిరాజ్- చిరాగ్‌శెట్టి జోడీ రన్నరప్‌గా నిలిచింది. అయితే ఇవాళ జరిగిన ఇండియా ఓపెన్ ఫైనల్‌లో భారత్ ద్వయానికి శుభారంభమే దక్కింది. తొలి గేమ్‌లో ప్రత్యర్థిని చిత్తుగా ఓడించింది. 21-15 తేడాతో 17 నిమిషాల్లోనే తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది.

కానీ తర్వాత సియో సీయుంగ్- కాంగ్ మిన్ జంట చెలరేగింది. భారత్ జోడీకి అవకాశం ఇవ్వకుండా రెండో గేమ్‌ను 21-11 దక్షిణా కొరియా జోడీ దక్కించుకుంది. మూడో గేమ్‌లో సాత్విక్, చిరాగ్ గొప్పగా పోరాడినప్పటికీ 12-21తో ఓటమిపాలైంది. సెమీఫైనల్లో సాత్విక్ జంట 21-18, 21-14తో అరోన్ చియా-సో వీయ్ (మలేసియా) జోడీని ఓడించిన విషయం తెలిసిందే.
కాగా, ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సాత్విక్ సాయిరాజ్- చిరాగ్‌శెట్టి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. ఈ జోడీ ఇటీవల మూడు టైటిళ్లు సాధించింది. స్విస్ ఓపెన్, ఇండోనేషియా ఓపెన్‌తో పాటు కొరియా ఓపెన్‌లను కైవసం చేసుకుంది.