Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టిన తెలుగు షట్లర్.. ఇరవై ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన సాత్విక్!

భారత స్టార్ షట్లర్ సాత్విక్‌సాయిరాజ్ రాంకీ రెడ్డి అరుదైన రికార్డు సాధించాడు. రెండు దశాబ్దాలుగా చెక్కు చెదరని గిన్నీస్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు. ప్రపంచంలో ఫాస్టెస్ట్ బ్యాడ్మింటన్ హిట్ కొట్టిన ప్లేయర్‌గా నిలిచాడు. 2022 కామన్‌వెల్త్ క్రీడల్లో గోల్డ్ మెడల్ కొట్టిన రాంకీ రెడ్డి ఏకంగా 565 కిలోమీటర్ల వేగంతో బ్యాడ్మింటన్ హిట్ నమోదు చేశాడు.

కొంచెం సింపుల్‌గా చూసుకుంటే ఫార్ములా 1 కారు టాప్ స్పీడులో వెళ్తే 372.6 కిలోమీటర్లు వెళ్తుంది. దీని కన్నా కూడా రాంకీరెడ్డి షాట్ 190 కిలోమీటర్లు వేగంగా ఉండటం గమనార్హం. ఇంతకుముందు మలేషియా ప్లేయర్ టాన్ పెర్లీ అత్యంత వేగవంతమైన షాట్ కొట్టిన మహిళగా రికార్డు సృష్టించింది. ఆమె గంటకు 438 కిలోమీటర్ల వేగంతో షాట్ కొట్టింది.

 SatwikSairaj Rankireddy

అంతకుముందు బ్యాడ్మింటన్‌లో అత్యంత వేగవంతమైన షాట్ కొట్టిన ప్లేయర్‌గా మలేషియా స్టార్, మాజీ వరల్డ్ నెంబర్ వన్ టాన్ బూన్ హాంగ్ పేరిట రికార్డు ఉండేది. అతను గంటకు 493 కిలోమీటర్ల వేగంతో షాట్ బాదాడు. ఇప్పుడు రాంకీరెడ్డి ఆ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. యానెక్స్ ఫ్యాక్టరీ జిమ్నాజియంలో ఈ షాట్‌ వేగాన్ని లెక్కించారు.

ఈ జిమ్నాజియం ప్రతినిధుల ప్రకారం, ఇంపాక్ట్ జరిగిన క్షణాలు హై-స్పీడ్ కెమెరాల్లో బంధిస్తారట. ఆ తర్వాత ఫొటోగ్రాఫిక్ రికార్డింగ్ సాయంతో షటిల్‌కాక్ వేగాన్ని లెక్కిస్తారు. ఈ రికార్డ్ బ్రేకింగ్ షాట్ కొట్టే సమయంలో రాంకీరెడ్డి.. యానెక్స్ నానోఫ్లేర్ 1000 జడ్ రాకెడ్ వాడినట్లు ఈ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

జపాన్‌లని సోకాలో ఉన్న యానెక్స్ ఫ్యాక్టరీ జిమ్నాజియంలో ఈ ప్రయోగం నిర్వహించారట. ఇక పురుషుల సింగిల్స్‌ విభాగంలో వేగవంతమైన స్మాష్ కొట్టిన ప్లేయర్‌ రికార్డు కూడా భారతీయుడి పేరిటే ఉంది. స్టార్ ప్లేయర్ లక్ష్య సేన్ ఈ రికార్డు సృష్టించాడు. బీడబ్ల్యూఎఫ్ కెనడా ఓపెన్ 2023 ఫైనల్‌లో ఆడిన అతను ఏకంగా గంటకు 420 కిలోమీటర్ల వేగంతో ఈ షాట్ కొట్టాడు.

Story first published: Tuesday, July 18, 2023, 22:49 [IST]
Other articles published on Jul 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+