
హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో ముంబై రాకెట్స్ జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డాషర్స్‌పై 4-1 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో లీ యోంగ్ డే-తాన్ బూన్ హెంగ్ (ముంబై) జోడీ 14-15, 15-14, 15-10తో వ్లాదిమిర్ ఇవనోవ్-సొజోనోవ్ (ఢిల్లీ) జోడీపై గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచింది.
రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ 15-11, 15-11తో హాంకాంగ్ ప్లేయర్ వింగ్ కీ వోంగ్ విన్సెంట్‌పై నెగ్గి ముంబై ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. ఈ మ్యాచ్‌ను ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకున్నందున ఢిల్లీ డాషర్స్ ఖాతాలో -1 పాయింటు కూడా చేరగా, ముంబై ఖాతాలో ఒక పాయింట్ చేరింది.
మూడో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో సుంగ్ జీ హున్ 12-15, 15-14, 15-9తో బీవెన్ జాంగ్ (ముంబై)పై నెగ్గడంతో ముంబై ఆధిక్యం (2-0) కొనసాగింది. ఆ తర్వాత నాలుగో మ్యాచ్‌గా జరిగిన మరో పురుషుల సింగిల్స్‌లో తియాన్ హువె (ఢిల్లీ) 13-15, 15-13, 15-9తో సన్ వాన్ హో (ముంబై) నెగ్గడంతో ముంబై జట్టు ఆధిక్యాన్ని 1-2కి తగ్గించింది.
చివరగా జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌ను ముంబై ట్రంప్ మ్యాచ్‌గా ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గాబ్రియేలా స్టొఇవా-లీ యోంగ్ డే (ముంబై) జోడీ 15-11, 15-9తో ప్రణవ్ చోప్రా-ఆరతి సారా (ఢిల్లీ) జోడీపై నెగ్గడంతో ముంబై ఖాతాలో మరో రెండు పాయింట్లు చేరాయి. దీంతో మొత్తంగా ముంబై 4-1తో మ్యాచ్‌ను గెలుచుకుంది.
మంగళవారం జరిగే మ్యాచ్‌లో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్‌తో నార్త్ ఈస్టర్న్ వారియర్స్ తలపడుతుంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.