For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇండోనేషియా ఓపెన్: సైనా సంచలనం

By Staff
Saina Nehwal
న్యూఢిల్లీ: ఇండోనేషియా సూపర్‌ సిరీస్‌ మహిళల బాడ్మింటన్ సింగిల్స్‌ టైటిల్‌ ను హైదరాబాద్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ సొంతం చేసుకుంది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో ప్రపంచ ఎనిమిదో నంబర్‌ క్రీడాకారిణి సైనా 12-21, 21-18, 21-9తో చైనాకు చెందిన ప్రపంచ మూడో ర్యాంకు లిన్‌ వాంగ్‌ పై అద్భుత విజయం సాధించింది. ఈ టోర్నీ నెగ్గిన తొలి భారతీయురాలు సైనానే. గత వారం లిన్‌ వాంగ్‌ చేతిలో ఓటమి పాలై సింగపూర్‌ ఓపెన్‌ నుంచి నిష్క్రమించిన సైనా మ్యాచ్‌ ఆరంభంలో తడబడింది.

అద్భుతమైన స్మాష్‌లతో సైనాను ఆటాడించిన వాంగ్‌ 9-4తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అదే వూపులో తొలి గేమ్‌ను కైవసం చేసుకుంది. ఐతే సైనా పుంజుకోవడంతో రెండో గేమ్‌ హోరాహోరీగా సాగింది. 5- 5.. 17-17.. ఇలా ఇద్దరి స్కోర్లూ సమమవుతూ వచ్చాయి. ప్రత్యర్థిని 18 స్కోరు వద్ద కట్టడి చేసిన సైనా గేమ్‌పాయింట్‌ సాధించి సెట్‌ను సొంతం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో సెట్‌ ఆరంభంలో ఇద్దరూ నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. స్కోరు 7-7తో సమమైంది. ఈ దశలో సైనా చెలరేగి ఆడింది. అద్భుతమైన నెట్‌ ప్లేతో ప్రత్యర్థిని ఆత్మరక్షణలో పడేసింది. వరుసగా పాయింట్లు సాధించింది. 15-9తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన సైనా అక్కడి నుంచి ప్రత్యర్థికి ఒక్క పాయింటూ ఇవ్వకుండానే గేమ్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. టైటిల్‌ నెగ్గినందుకు సైనాకు భారత బ్యాడ్మింటన్‌ సంఘం రూ.2 లక్షల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సైనాకు అభినందనలు తెలిపారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+