
శుక్రవారం సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన లిన్ వాంగ్ ను ఎదుర్కుంటుంది. బుధవారం ప్రొకఫెంకోతో మ్యాచ్ లో సైనా ఆటను చూసిన పెత్యా పక్కా ప్లాన్ తో ఆటలోకి అడుగుపెట్టింది. సైనా స్మాష్ లతో విరుచుకుపడినా బెదరకుండా పెత్యా సైనాను ఎక్కువ సేపు అడించి అలసిపోయేలా చేసేందుకు ప్రయత్నించింది. ఈ స్థితిలో తొలి సెట్ గెలుచుకుంది. ఆ తర్వాత సైనా తన ఆటకు పదును పెట్టింది. దీంతో పెత్యా వెనక్కి తగ్గక తప్పలేదు.