సైనా, సమీర్ స్విస్‌లో సత్తాచాటేనా?

హైదరాబాద్: ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో నిరాశపరిచిన భారత స్టార్లకు సత్తా చాటేందుకు మరో అవకాశం లభించింది. మంగళవారం నుంచి స్విస్ ఓపె న్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరగనుంది. ఈ టోర్నీలో భారత్ నుంచి మహిళల సింగిల్స్‌లో రెండుసార్లు చాంపియన్ సైనా నెహ్వాల్, పురుషుల్లో డిఫెండింగ్ చాంపియన్ సమీర్ వర్మ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నారు.

ముచ్చటగా మూడోసారి విజేతగా
భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ఈ టోర్నీలో ఆడడం లేదు. ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ), ఒలింపిక్ ఛాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) ఈ టోర్నీకి దూరంగా ఉండటంతో రెండు సార్లు(2011, 12)లో స్విస్ టైటిళ్లు గెలిచిన సైనా.. ముచ్చటగా మూడోసారి విజేతగా నిలిచేందుకు తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

తొలి రౌండ్‌లో క్వాలిఫయర్‌తో తలపడనున్న సైనా
ఆదివారంతో ముగిసిన ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో డయేరియా కారణంగా క్వార్టర్స్‌లోనే నిష్క్రమించిన సైనా తొలి రౌండ్‌లో క్వాలిఫయర్‌తో తలపడనుంది. ఆరంభరౌండ్లను దాటితే సైనాకు సెమీస్‌లో రెండోసీడ్ బిన్‌గ్జియావో, ఫైన ల్లో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ విజేత చెన్ యుఫీ ఎదురుపడొచ్చు. సైనాతో పాటు భారత్ నుంచి మహిళల సింగిల్స్‌లో వైష్ణవి, ముగ్ధా బరిలో ఉన్నారు.

గతేడాది ఇదే టోర్నీలో సంచలనం
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో రాజీవ్ ఔసెఫ్ (ఇంగ్లాండ్)తో సాయిప్రణీత్, సౌరభ్‌వర్మతో సమీర్‌వర్మ, క్వాలిఫయర్‌తో కశ్యప్ పోటీపడతారు. గతేడాది ఇక్కడ టైటిల్ నెగ్గే క్రమంలో క్వార్టర్స్‌లో జపాన్ స్టార్ కెంటో మొమొటాను చిత్తుచేసి సంచలనం సృష్టించాడు. ఈ నేపథ్యంలో ఇక్కడ గత ఫలితాన్ని పునరావృతం చేయాలన్న పట్టుదలతో సమీర్ బరిలోకి దిగుతున్నాడు.

మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి, అశ్విని జోడీ
వీరితో పాటు సింగిల్స్‌లో కశ్యప్, శుభాంకర్ డే పోటీలో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో వైష్ణవి, పురుషుల డబుల్స్‌లో అర్జున్, రామచంద్రన్ జోడీతో పాటు సుమిత్‌రెడ్డి, మను అత్రి ద్వయం తమ అదృష్టాన్ని పరీక్షించుకనేందుకు రెడీ అయ్యారు. మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి, అశ్విని జోడీ, పూజ దండు, సంజనా సంతోష్, మిక్స్‌డ్ డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా, సిక్కి టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications