స్విస్ ఓపెన్: తప్పుకున్న సైనా, కారణం అదేనా?
హైదరాబాద్: స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రీ నుంచి భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ తప్పుకుంది. స్విట్జర్లాండ్‌లోని బసెల్‌లో మార్చి 14 నుంచి 19 వరకు ఈ టోర్నీ జరగనుంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సైనాకు ఈ టోర్నీలో మహిళ సింగిల్స్‌లో టాప్ సీడింగ్ దక్కింది.
గతంలో స్విస్ ఓపెన్‌లో రెండుసార్లు ఛాంపియన్‌గా కూడా సైనా నెహ్వాల్ నిలిచింది. 2011లో సన్ జి హయున్ (కొరియా)పై నెగ్గి తొలిసారి స్విస్ టైటిల్ సాధించిన సైనా, ఆ తర్వాత ఏడాది 2012లోనూ విజేతగా నిలిచింది. ఫైనల్లో ప్రపంచ మాజీ నెంబర్ వన్ వాంగ్ షిజియాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పోరాడి విజయం సాధించింది.

ఇంగ్లాండ్ ఓపెన్: క్వార్టర్స్‌లోనే వెనుదిరిగిన సైనా
ఇదిలా ఉంటే ఆదివారం ముగిసిన ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌లో క్వార్టర్స్‌లోనే సైనా నెహ్వాల్ వెనుదిరిగిన సంగతి తెలిసిందే. కొరియా షట్లర్ సన్ జి హయున్‌తో తుదివరకూ పోరాడిన సైనా 20-22, 20-22తో ఓటమి పాలైంది. ప్రతిష్టాత్మక టోర్నీ కావడంతో సైనా చాలా కష్టపడింది.

విశ్రాంతి తీసుకునే ఉద్దేశంతోనే
ఈ నేపథ్యంలో సైనా కొంత విశ్రాంతి తీసుకునే ఉద్దేశంతో స్విస్ ఓపెన్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది సెప్టెంబర్‌లో సైనా మోకాలి శస్త్ర చికిత్స చేయించుకుంది. ఆ తర్వాత రీఎంట్రీలో 2017లో జరిగే టోర్నీల్లో చాలా జాగ్రత్తగా ఓ ప్రణాళిక ప్రకారం సిద్ధమవుతోంది.

2017లో ఓ ప్లాన్ ప్రకారం
టోర్నీ టోర్నీకి మధ్య తగిన విశ్రాంతి తీసుకోవాలనే ప్రణాళికను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే స్విస్ ఓపెన్ నుంచి తప్పుకున్నట్టు సమాచారం. మార్చి 28 నుంచి ఏప్రిల్ 2 వరకు న్యూఢిల్లీలో ప్రారంభం కానున్న ఇండియా ఓపెన్ సూపర్ సిరిస్‌లో సైనా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పీవీ సింధు కూడా
2015లో ఈ టోర్నీలో సైనా విజయం సాధించడంతో వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ఆమె స్ధానం మరింతగా మెరుగుపరచుకుంది. ఇదిలా ఉంటే మరో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కూడా స్విస్ ఓపెన్ నుంచి తప్పుకుంది. కాగా, స్టార్ ప్లేయర్ల గైర్హాజరీతో రుత్విక శివాని, కృష్ణ ప్రియలు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక పురుషుల విభాగంలో టాప్ షట్లర్ కిడాంబి శ్రీకాంత టోర్నీకి దూరం కాగా హెచ్‌ఎస్ ప్రణయ్, అజయ్ జయరామ్, సమీర్ టైటిల్ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications