
సైనా నెహ్వాల్
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్, టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి దూకుడుగా ఆడడం నేర్చుకుంటున్నానని భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తెలిపింది. భవిష్యత్తులో మరింత దూకుడుగా ఆడతానని చెప్పింది.

సైనా నెహ్వాల్
‘ప్రస్తుతం బ్యాడ్మింటన్‌లో దూకుడు పెరిగింది. కరోలినా మారిన్ దూకుడుగా, వేగంగా ఆడుతుంది. నాకు కూడా అలా ఆడాలని అనిపిస్తోంది. క్రికెట్లో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. మైదానంలో అతనెంతో దూకుడుగా ఉంటాడు. దాని వల్ల ప్రదర్శన మరింత మెరుగవుతుంది. అందుకే కోహ్లి నుంచి దూకుడు నేర్చుకుంటున్నా. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నేను కూడా అటాకింగ్ గేమ్ ఆడా. ఫలితం వచ్చింది' అని సైనా తెలిపింది.

సైనా నెహ్వాల్
ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ గెలిచి మంగళవారం హైదరాబాద్ తిరిగొచ్చిన సైనా మీడియాతో మాట్లాడింది. ఫైనల్లో చైనా క్రీడాకారిణి సున్ యూపై గెలిచిన సైనా.. టైటిల్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఒలింపిక్స్‌లో పతకం గెలుస్తానని సైనా ధీమా వ్యక్తం చేసింది.

సైనా నెహ్వాల్
‘ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గడం ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అందరు క్రీడాకారులలాగే ఒలింపిక్స్ నా కల. ఈసారి నాన్న నాతో రియోకు వస్తున్నాడు. పతకంతో తిరిగొస్తానని ఆశిస్తున్నా. అదంత సులభం కాదని తెలుసు. నా శక్తి మేర ప్రయత్నిస్తా. ఒలింపిక్స్ గురించి అతిగా ఆలోచిస్తూ ఒత్తిడి పెంచుకోను. వీలైనంత ఎక్కువగా కష్టపడతా' అని సైనా తెలిపింది.


Click it and Unblock the Notifications











