Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అధికారికంగా సైనా వరల్డ్ నెం.1: మద్దతుగా నిలిచినందుకు ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు

హైదరాబాద్: హైదరాబాద్ ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్‌లో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకులో నిలిచింది. ఈ మేరకు ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అధికారకంగా ప్రకటించింది. ఈ సందర్భంలో చాలా సంతోషంగా ఉందని, తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది.


వరల్డ్ బ్యాడ్మింటన్‌లో నెంబర్ వన్ ర్యాంకు సాధించిన తొలి భారతీయ మహిళగా సైనా నెహ్వాల్ చరిత్ర సృష్టించారు. గతంలో పురుషుల్లో ప్రకాశ్ పదుకొణె ఈ అరుదైన రికార్డుని సాధించగా, ఇప్పుడు సైనా నెహ్వాల్ మహిళల విభాగంలో సాధించారు.

నెంబర్ వన్ ర్యాంకుపై గురి పెట్టి సైనా నెహ్వాల్‌తో పాటు, ఆల్ ఇంగ్లాండ్ టైటిల్ విజేత కరోలినా మారిన్ భారత సూపర్ సిరిస్‌ టోర్నమెంట్‌లో అడుగుపెట్టారు. అయితే అనూహ్యాంగా సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కరోలినా మారిన్ ఓటమితో సైనా నెహ్వాల్ ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకుని కైవసం చేసుకున్నారు.

Saina Nehwal thanks fans after officially becoming World No. 1

ఇక ఇండియా బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వల్ విజేతగా నిలిచింది. ఫైనల్లో థాయ్‌లాండ్ ఫ్లేయర్ రచనోక్ పై 21-16, 21-14 తేడాతో సైన నెహ్వల్ ఘన విజయం సాధించింది. కెరీర్‌లో తొలిసారి ఇండియా సూపర్ సిరిస్ సైనా గెలిచింది. ఈ టైటిల్ గెలిచిన తొలి భారత షట్లర్‌గా సైనా రికార్డు సాధించింది.

ప్రస్తుతం సైనా నెహ్వాల్ మలేషియా ఓపెన్ సిరిస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఆడుతున్నారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా నెహ్వాల్ 21-13, 21-16తేడాతో మరియా కుసుమస్తుతి (ఇండోనేషియా)పై విజయం సాధించింది. 37 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సైనా పూర్తి ఆధిపత్యం కనబర్చింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+