For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సైనాకు కోచ్‍‌గా కశ్యప్.. టోర్నీలో శుభారంభం

Saina Nehwal Survives as PV Sindhu Ousted From Denmark Open

డెన్మార్క్: ఓపెన్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సైనా నెహ్వాల్‌ ముందంజ వేయగా.. పి.వి.సింధుకు ఊహించని ఓటమి ఎదురైంది. సమీర్‌ వర్మ సంచలన విజయంతో ముందంజ వేశాడు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో సైనా 20-22, 21-17, 24-22తో చుంగ్‌ యి (హాంకాంగ్‌)పై విజయం సాధించింది. మూడో సీడ్‌ సింధుకు 17-21, 21-16,18-21తో బీవెన్‌ జంగ్‌ (అమెరికా) షాకిచ్చింది.

సైనాకు గంటా 21 నిమిషాల సమయం

సైనాకు గంటా 21 నిమిషాల సమయం

24వ ర్యాంకర్‌ చుంగ్‌ను ఓడించడానికి సైనాకు ఒక గంటా 21 నిమిషాల సమయం పట్టింది. సైనా మొదట్నుంచి దూకుడుగా ఆడగా.. చుంగ్‌ ర్యాలీ గేమ్‌తో పాయింట్లు రాబట్టింది. నువ్వానేనా అన్నట్టుగా సాగిన తొలి గేమ్‌లో ఇద్దరూ 20-20తో సమానంగా నిలిచారు. ఐతే కీలక సమయంలో వరుసగా 2 అనవసర తప్పిదాలు సైనాకు తొలి గేమ్‌ను దూరం చేశాయి. ఆ తర్వాత సైనా మరింత దూకుడుగా.. సాధికారికంగా ఆడి 21-17తో రెండో గేమ్‌ సొంతం చేసుకుంది.

సైనా పుంజుకుని 19-17తో మ్యాచ్‌కు చేరువై

సైనా పుంజుకుని 19-17తో మ్యాచ్‌కు చేరువై

నిర్ణయాత్మక మూడో గేమ్‌ హోరాహోరీగా సాగింది. సైనా స్థాయికి తగ్గట్లు ఆడినా.. చుంగ్‌ పోరాటడంతో చివరి పాయింటు వరకు ఉత్కంఠ కొనసాగింది. 15-17తో వెనుకంజలో ఉన్న సైనా అద్భుతంగా పుంజుకుని 19-17తో మ్యాచ్‌కు చేరువైంది. చుంగ్‌ వరుసగా 3 పాయింట్లు రాబట్టి 20-19తో ఆధిక్యం సంపాదించింది. ఇంకొక్క పాయింటు గెలిస్తే చుంగ్‌దే మ్యాచ్‌.

బీవెన్‌ మరింత మెరుగ్గా ఆడటంతో సింధు వెనుకబడి

బీవెన్‌ మరింత మెరుగ్గా ఆడటంతో సింధు వెనుకబడి

ఎంతో పరిణతితో ఆడిన సైనా అనవసర తప్పిదాలకు అవకాశమివ్వలేదు. చుంగ్‌కు లభించిన 3 మ్యాచ్‌ పాయింట్లను సమర్థంగా కాచుకుని 23-22తో ముందంజ వేసింది. చుంగ్‌ షటిల్‌ను బయటకు ఆడేయడంతో మ్యాచ్‌ సైనా సొంతమైంది. అంతకుముందు సింధు మ్యాచ్‌ 56 నిమిషాల్లో ముగిసింది. తొలి గేమ్‌ను 17-21తో కోల్పోయిన సింధు.. 21-16తో రెండో గేమ్‌ దక్కించుకుంది. మూడో గేమ్‌లో సింధు 15-13తో ఆధిక్యంలో నిలిచింది. ఐతే బీవెన్‌ మరింత మెరుగ్గా ఆడటంతో సింధు వెనుకబడింది.

 సైనా మ్యాచ్‌కు సియాదత్‌తో పాటు కశ్యప్‌ కోచ్‌గా

సైనా మ్యాచ్‌కు సియాదత్‌తో పాటు కశ్యప్‌ కోచ్‌గా

పారుపల్లి కశ్యప్‌ తనకెంతో మానసిక స్థైర్యం, స్ఫూర్తి ఇస్తాడని గతంలో చాలాసార్లు చెప్పింది సైనా. కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం నెగ్గడంలోనూ కశ్యప్‌ది కీలకపాత్ర అంటూ ట్విటర్‌లో పేర్కొంది. సైనా అతడినే పెళ్లాడబోతున్న సంగతి కూడా తెలిసిందే. సైనా మ్యాచ్‌ అవుతున్న సమయంలో కశ్యప్‌ కోచ్‌ అవతారం ఎత్తాడు. సైనా మ్యాచ్‌కు సియాదత్‌తో పాటు కశ్యప్‌ కోచ్‌గా వ్యవహరించాడు. మ్యాచ్‌ జరుగుతున్నంతసేపు, విరామ సమయాల్లో సైనాకు కశ్యపే సలహాలిచ్చాడు.

Story first published: Wednesday, October 17, 2018, 10:52 [IST]
Other articles published on Oct 17, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+