న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ చైనా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరుకుంది. హైక్సినా ఒలింపిక్ స్పోర్ట్ సెంటర్‌లో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్స్‌లో చైనాకి చెందిన లియు జిన్‌పై 21-17, 21-17 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. 49 నిమిషాల పాటు ఈ మ్యాచ్ సాగింది.
చైనా ఓపెన్ ఫైనల్స్‌లోకి సైనా నెహ్వాల్ రావడం ఇది ఆరోసారి. రేపు జరగనున్న ఫైనల్స్‌లో ఐదవ ర్యాంకింగ్‌లో ఉన్న సైనా నెహ్వాల్ కోరియాకు చెందిన బే యాన్ జు లేదా జపాన్‌కు చెందిన అకానె యమగుచితో తలపడనుంది.

శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆరో సీడ్ సైనా 21-13, 17-21, 21-5 పాయింట్లతో ది సుయో (చైనా)పై విజయం సాధించింది. 59 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో చెరో గేమ్ నెగ్గి సమంగా నిలిచారు.
దీంతో మూడవ గేమ్ నిర్ణయాత్మకం అడంతో ఒక్కసారిగా చెలరేగిన సైనా ప్రత్యర్ధికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చిత్తు చేసింది. భారత ఆటగాడు పారుపల్లి కశ్యప్ మాత్రం క్వార్టర్ ఫైనల్లోనే పరాజయం పాలయ్యాడు.