Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సింధు అక్కడే.. సైనానే పది స్థానాలు కిందకి..

Saina Nehwal Slips Out Of Top 10 BWF Rankings

హైదరాబాద్: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బీడబ్ల్యూఎఫ్‌ మహిళల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ మరింత కిందికి దిగింది. ఆమె టాప్‌-10కు దూరమైంది. గురువారం ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) వెల్లడించిన ర్యాంకింగ్స్‌ జాబితాలో ఆమె ఒక స్థానం దిగజారి 11వ ర్యాంకుకు చేరింది.

ఇటీవలి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సైనా క్వార్టర్స్‌లోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అదే టోర్నీలో ఫైనల్‌ చేరిన మరో స్టార్‌ షట్లర్‌ సింధు ర్యాంకులో మార్పు లేదు. ఆమె మూడో స్థానంలోనే కొనసాగుతోంది. తై జు యింగ్‌ మహిళల్లో టాప్‌ ర్యాంకులోనే ఉండగా యమగుచి ఆ తర్వాత కొనసాగుతోంది.

పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ రెండు స్థానాలు తగ్గి ఎనిమిదో ర్యాంకులో నిలిచాడు. హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ 11, సమీర్‌ వర్మ 21, సాయిప్రణీత్‌ 24 ర్యాంకుల్లో ఉన్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి 25 నుంచి 23వ ర్యాంకుకు చేరుకోగా.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ప్రణవ్‌ చోప్రా-సిక్కి రెడ్డి రెండు స్థానాలు కోల్పోయి 24వ ర్యాంకులో కొనసాగుతున్నారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-అశ్విని పొన్నప్ప జోడీ 12 స్థానాలు మెరుగు పరుచుకుని, కెరీర్లోనే అత్యుత్తమంగా 28వ ర్యాంకులో నిలిచింది.

క్వార్టర్స్‌లో జయరాం: వియత్నాం ఓపెన్‌ టూర్‌ సూపర్‌ 100 టోర్నీలో భారత షట్లర్లు అజయ్‌ జయరాం, రితుపర్ణ దాస్‌ క్వార్టర్‌ఫైనల్‌ చేరారు. గురువారం పురుషుల సింగిల్స్‌ ప్రి క్వార్టర్స్‌లో జయరాం 22-20, 21-14 తేడాతో టాప్‌సీడ్‌ కోల్హో (బ్రెజిల్‌)కు షాకిచ్చాడు. మహిళల సింగిల్స్‌లో రితుపర్ణ 21-8, 21-14తో ఆరో సీడ్‌ సంగ్‌ షూ యన్‌ (చైనీస్‌ తైపీ)ను చిత్తు చేసింది.

Story first published: Friday, August 10, 2018, 11:00 [IST]
Other articles published on Aug 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+