Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డబ్బుతోపాటు కవరేజ్‌ కూడా పెరుగుతుంది: సైనా

Saina Nehwal slams BWF for 'crammed' calendar

హైదరాబాద్: 2018 ని దృష్టిలో ఉంచుకుని ప్రపంచ బ్యాడ్మింటన్ సమితి (బీడబ్ల్యూఎఫ్) షెడ్యూల్‌ని ప్రకటించింది. దీనికి సంబంధించి భారత జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ మంగళవారం స్పందించారు. ఇప్పుడు తాజాగా భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ సైతం నిర్వహక సంఘంపై విరుచుకుపడుతుంది. టోర్నీలు పెరిగితే ఉత్తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఎక్కడుంటుందని ప్రశ్నిస్తుంది.

సైనా నెహ్వాల్ బుధవారం క్యాలెండర్ ఇయర్ షెడ్యూల్‌పై స్పందించింది. ఇక్కడే మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఆమె.. ఆగ్రహాన్ని వెలిబుచ్చింది. 2018కి బీడబ్ల్యూఎఫ్‌ నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకా రం సింగిల్స్‌లో టాప్‌ 15మంది, డబుల్స్‌లో టాప్‌ పది జోడీలు కనీసం 12 టోర్నీలు ఆడాల్సి ఉంటుందని తెలిపింది. అలా బరిలో దిగకపోతే షట్లర్లు జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించింది.

'బీడబ్ల్యూఎఫ్‌ క్యాలెండర్‌ టాప్‌ ప్లేయర్లకు చేటుచేసే లా ఉంది. నా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించేందుకు తగినంత విరామం ఉండాలి. ఒకదానివెంట ఓ టోర్నీ లో నేను పాల్గొనలేను. ఏదో ఆడాలి కాబట్టి.. బరిలో దిగుతున్నా అన్నట్టు ఉంటుందే తప్ప విజేతను కాలేను' అని బుధవారం ఇక్కడ పీబీఎల్‌ కార్యక్రమంలో భాగంగా సైనా వ్యాఖ్యానించింది.

డబ్బులు కోసమే అయితే..
'బ్యాడ్మింటన్‌ను టె న్నిస్‌లా జనరంజకంగా మార్చాలని బీడబ్ల్యూఎఫ్‌ భావిస్తుంటే.. గ్రాండ్‌స్లామ్స్‌లా 4,5 టోర్నమెంట్‌లనే రూపొందిస్తే సరిపోయేది' అని అభిప్రాయపడింది. అలా గైతే డబ్బుతోపాటు కవరేజ్‌ కూడా పెరుగుతుందని తెలిపింది. మరో మేటి క్రీడాకారిణి కరోలినా మారిన్‌ కూడా సైనాకు మద్దతు పలికింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 21, 2017, 10:35 [IST]
Other articles published on Dec 21, 2017
Read in English: Saina slams BWF
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+