హాంకాంగ్ ఓపెన్: సైనా, ప్రణయ్ ముందుకు, కశ్యప్ ఇంటికి

హైదరాబాద్: హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరిస్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో డెన్మార్క్‌కు చెందిన మెట్టీ పౌల్సేన్‌పై 21-19, 23-21తేడాతో విజయం సాధించి రెండో రౌండ్‌కు అర్హత సాధించింది.
46నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఇద్దరికి ఇద్దరూ తగ్గలేదు. మ్యాచ్ అరంభం నుంచీ పోటా పోటీగా ఆడారు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో కొరియాకు చెందిన డీ కీలీ చేతిలో పారుపల్లి కశ్యప్ 21-15, 9-21, 20-22తేడాతో ఓటమి పాలయ్యాడు.
మరో మ్యాచ్‌లో భారత్‌కు చెందిన మరో స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ హాంకాంగ్‌కు చెందిన హు యున్‌పై 19-21, 21-17, 21-15తేడాతో విజయం సాధించాడు. 60 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను కోల్పోయిన ప్రణయ్ ఆ తర్వాతి రెండు గేముల్లో పుంజుకున్న తీరు అద్భుతం.
Story first published: Wednesday, November 22, 2017, 16:09 [IST]
Other articles published on Nov 22, 2017
Read in English: Saina in second round, Kashyap ousted
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications