Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సౌకర్యాలున్నా కోచ్‌లు లేరు: అకాడమీలపై సైనా ఆవేదన

బెంగుళూరు: బ్యాడ్మింటన్‌ మెరుగయ్యేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నా, తగినంత మంది కోచ్‌లు, అకాడమీలు లేకపోవడం పట్ల స్టార్ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ విచారం వ్యక్తం చేశారు. రియో ఒలింపిక్స్ అనంతరం మోకాలికి ఆపరేషన్ చేయించుకుని సైనా కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అయితే నవంబర్ 15 నుంచి జరగనున్న చైనా సూపర్ సిరిస్ కోసం తాజాగా బెంగుళూరులో ప్రాక్టీస్‌ మొదలుపెట్టింది. ఈ సందర్భంగా సైనా నెహ్వాల్ ఆదివారం మీడియాతో మాట్లాడింది. మన దేశంలో సౌకర్యాలకు కొదవలేదని, చైనాతో పోలిస్తే బ్యాడ్మింటన్ అకాడమీలు, సాధ్యమైనంత మంది కోచ్‌లు లేరని ఆవేదన వ్యక్తం చేసింది.

Saina Nehwal Rues Lack of Badminton Coaches in India

అందువల్లే బ్యాడ్మింటన్‌లో వెనకబడిపోయామని సైనా పేర్కొంది. 'భారత్‌లో కనీసం 20 నుంచి 30 మంది కోచ్‌లు అవసరంగా కాగా.. ప్రస్తుతం ఇద్దరు లేదా ముగ్గరికి మించి లేరు' అని సైనా వివరించింది. అదే చైనా విషయానికి వస్తే అలా లేదని ఆమె పేర్కొంది.

'చైనాను చూడండి. 30 వేల నుంచి 40 వేల వరకూ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఉంటారు. అంతేకాదు ఏదైనా ఈవెంట్ జరుగుతుంటే చాలు నలుగురు లేదా ఐదుగురు కోచ్‌‌లు ఉంటారు. ఇదే వారిని చాంపియన్స్‌గా నిలుపుతుంది' అని సైనా వివరించింది. చైనా సూపర్‌ సిరీస్‌లో పోటీ గురించి ప్రశ్నించగా ప్రస్తుతం బ్యాడ్మింటన్‌లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్న చైనాను తక్కువ అంచనా వేయకూడదని సూచించింది.

అక్కడ అధిక సంఖ్యలో కోచ్‌లు, అకాడమీలు ఉన్నారు కాబట్టి... ఛాంపియన్లు తయారు చేయడం ఏ మాత్రం కష్టంకాదనే సైనా తన అభిప్రాయం వ్యక్తం చేసింది. అది వారికి చాలా సులభం కూడా, అంతేకాదు అక్కడే ఏ క్షణమైనా ఛాంపియన్లను తయారు చేసే సత్తా అక్కడి కోచ్‌లకు ఉందని సైనా పేర్కొంది.

26 ఏళ్ల సైనా నెహ్వాల్ ప్రస్తుతం నవంబర్ 15 నుంచి 20 వరకు జరగనున్న చైనా సూపర్ సిరిస్‌పై దృష్టి సారించింది. ఇది ముగిసిన తర్వాత నవంబర్ 22 నుంచి 27 వరకు జరగనున్న హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరిస్‌లో సైనా పాల్గొంటుంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+