న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో రజత పతకం గెలిచిన భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ మరోసారి వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకును దక్కించుకుంది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) విడుదల చేసిన తాజా ర్యాకింగ్స్‌లో సైనా నెహ్వాల్ నెంబర్ వన్ స్ధానానికి దూసుకెళ్లింది.
25ఏళ్ల సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్‌లో నెంబర్ వన్ ర్యాంకులో నిలిచింది. తాజా ర్యాంకింగ్స్‌లో వరల్డ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్‌లో సైనాను ఓడించిన స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ రెండో స్థానంలో నిలిచింది. మూడవ స్ధానంలో చైనా క్రీడాకారిణి జు యింగ్ నిలిచింది.

వరల్డ్ చాంపియన్ షిప్‌లో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయిన తెలుగు తేజం పీవీ సింధు 14వ స్థానానికి పడిపోయింది. ఇక పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ 4వ ర్యాంకు సాధించగా, పారుపల్లి కశ్యప్ రెండు స్థానాలు ఎగబాకి 8వ ర్యాంకు దక్కించుకున్నాడు.
కాగా, మహిళల డబుల్స్ విభాగంలో గుత్తా జ్వాల-అశ్విని పొనప్ప జోడీ కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకు సాధించింది. ఈ జోడీ 10వ ర్యాంకులో నిలిచింది.