For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మళ్లీ ప్రపంచ నెంబర్ 1 స్థానం దక్కించుకున్న సైనా నెహ్వాల్

By Srinivas

న్యూఢిల్లీ: భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ మళ్లీ నెంబర్ వన్ స్థానం కైవసం చేసుకున్నారు. ఇటీవలే నెంబర్ వన్ స్థానం కోల్పోయిన సైనా మళ్లీ ఒకటో స్థానానికి ఎగబాకారు. నెంబర్ వన్ స్థానానికి ఎగబాకిన తొలి భారత మహిళా షట్లర్ సైనా కావడం గమనార్హం.

కాగా, సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్‌లో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకులో నిలిచింది. ఈ మేరకు ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అధికారకంగా ఇటీవల ప్రకటించింది. ఈ సందర్భంలో చాలా సంతోషంగా ఉందని, తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ సైనా ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది.

వరల్డ్ బ్యాడ్మింటన్‌లో నెంబర్ వన్ ర్యాంకు సాధించిన తొలి భారతీయ మహిళగా సైనా నెహ్వాల్ చరిత్ర సృష్టించారు. గతంలో పురుషుల్లో ప్రకాశ్ పదుకొణె ఈ అరుదైన రికార్డుని సాధించగా, ఇప్పుడు సైనా నెహ్వాల్ మహిళల విభాగంలో సాధించారు.

Saina Nehwal regains top spot in latest BWF rankings

నెంబర్ వన్ ర్యాంకుపై గురి పెట్టి సైనా నెహ్వాల్‌తో పాటు, ఆల్ ఇంగ్లాండ్ టైటిల్ విజేత కరోలినా మారిన్ భారత సూపర్ సిరిస్‌ టోర్నమెంట్‌లో అడుగుపెట్టారు. అయితే అనూహ్యాంగా సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కరోలినా మారిన్ ఓటమితో సైనా నెహ్వాల్ ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకుని కైవసం చేసుకున్నారు. ఇక ఇండియా బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్‌లో సైనా నెహ్వల్ విజేతగా నిలిచింది.

అనంతరం కొద్ది రోజులకే సైనా నెంబర్ వన్ ర్యాంక్ పోయింది. ఇటీవల సైనా మలేషియా ఓపెన్ సెమీ ఫైనల్లో ఓటమి పాలైంది. చైనా క్రీడాకారిణి లీ జ్యూరీ చేతిలో 21-13, 17-21, 20-22 తేడాతో సైనా ఓటమిపాలైంది. ఈ టోర్నీలో ఓటమి పాలైన సైనా నెహ్వాల్ తన ప్రపంచ నెంబర్ 1ను కూడా కోల్పోయింది. ఇప్పుడు నెంబర్ వన్‌గా నిలిచింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:11 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+